శిశుమందిర్‌లో భారతీయ కళలపై వర్క్‌షాప్‌

0

ప్రభుత్వ సాంస్కృతిక శాఖ, విద్యాభారతి సంస్కృతి శిక్షా సంస్థాన్‌ ఢిల్లీ ఆధ్వర్యంలో ఈ నెల 28, 29 తేదీల్లో మంథనిలోని శ్రీ సరస్వతీ శిశుమందిర్‌ పాఠశాలలో బారతీయ సాంస్కృతిక కళలు అనే అంశంపై వర్క్‌షాప్‌ నిర్వహించనున్నట్లు పాఠశాల ప్రధానాచార్యులు తెలిపారు. ఈ వర్క్‌షాప్‌లో స్థానిక ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్ధులతో పాటు మండలంలోని ఆయా పాఠశాలలకు చెందిన విద్యార్ధులు పాల్గొంటారని, ఇందులో చిత్రలేఖనం, చెక్క భజన, నృత్యాలు, కోలాటాలు, అభినయ గేయాలు,అన్నమాచార్య కీర్తనలు, కత్తిరింపులు వంటి అంశాల్లో శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ వర్క్‌షాప్‌ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులతో పాటు విద్యాపీఠం ప్రతినిధులు పాల్గొంటారని, విద్యార్ధులు అదిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆమె కోరారు.

You are able to post comments by logging in through facebook.

comments

Share.

About Author

Comments are closed.