మంథనిలో రూపాయికే లీటర్ వాటర్

0

Manthani : పేదలు, బడుగు, బలహీనవర్గాల అవసరాలు తీర్చడమే సీఎం కేసీఆర్ నాయకత్వంలోని ప్రభుత్వ లక్ష్యమని ఎంపీ బాల్కసుమన్ చెప్పారు. కరీంనగర్ జిల్లా మంథని ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో ఎంపీ నిధులతో రూ.8 లక్షలతో రూపాయికే లీటర్ నీటి సరఫరా యంత్రాన్ని ఏర్పాటు చేయగా, ఎమ్మెల్యే పుట్ట మధు బుధవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా బాల్క సుమన్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పాలనకు అనుగుణంగా ప్రజాప్రతినిధులు వినూత్న ఆలోచనలతో ప్రజలకు సేవలందిస్తున్నారన్నారు. బస్టాండ్‌లో ప్రయాణికులకు స్వచ్ఛమైన తాగునీరు అందించాలనే ఉద్దేశంతో ఎనీటైం వాటర్(ఏటీడబ్ల్యూ)ను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. లీటర్ మినరల్‌వాటర్ బాటిల్ రూ.20 పెట్టి కొనుగోలు చేయాల్సి వస్తున్నదని, సామాన్యులకు అందుబాటులో తెచ్చేందుకే ఏటీడబ్ల్యూను ప్రారంభించినట్లు తెలిపారు. నిజామాబాద్, ఆదిలాబాద్, మహబూబాబాద్, భువనగిరి, మెదక్‌లో కూడా స్థానిక ఎంపీలు ఈ ఏటీడబ్ల్యూలను ఏర్పాటు చేయబోతున్నారని చెప్పారు. కార్యక్రమంలో మంథని సర్పంచ్ పుట్ట శైలజ తదితరులు పాల్గొన్నారు.

You are able to post comments by logging in through facebook.

comments

Share.

Comments are closed.