పెద్దపల్లి జిల్లాలోని మంథని గ్రామాన్ని చూసిన వారు ఎవరైనా ఒకటే అంటారు “ఈ పట్టణము కాశి వలె ఉందని రెండవ కాశీగా మంథని గ్రామాన్ని” అభివర్ణిస్తారు.ఈ ఆధ్యాత్మిక క్షేత్రంలో ప్రతి నెల రోజులకొకసారి పురాణాలు ఆధ్యాత్మిక గురువుల చేత చెప్పబడతాయి.ఎంతో ప్రశాంతమైన వాతావరణంలో ఈ ఆధ్యాత్మిక బోధనలు జరుగుతాయి.ఇక్కడి దేవాలయాలు చూస్తే సాక్షాత్తు ఆ పరమశివుడు మంథని లో తిరుగుతున్నాడా అనిపిస్తుంది.ప్రస్తుతం మంథని గోదావరి వెళ్లే మార్గంలో సురాబాండేశ్వర ఆలయంలో బ్రహ్మశ్రీ వద్ధిపర్తి పద్మాకర్ గారి చే” శ్రీ వెంకటాచల మహాత్మ్యం ” 19/01/2017 నుండి వారం రోజులపాటు చెప్పబడుతున్నది.భారత దేశము లో రెండు ప్రదేశాల్లో మాత్రమే పశ్చిమ ముఖ శివాలయాలు ఉన్నవి ఒకటి కాశి పట్టణంలో,రెండవది మంథని లోని భిక్షేశ్వర ఆలయంలో,మంథని వచ్చే వారు తప్పకుండా ఇక్కడి ప్రసిద్ధ ఆలయాలు దర్శించాలి.
మంథనిలో వైభవముగా కొనసాగుతున్న ప్రవచనాలు
0
Share.