వాసుదేవానంద సరస్వతి

0

ఆ కాలంలో అవధానులు నర్సింహులు సోమయాజులు గారింట్లో నిత్యాగ్నిహోత్రం,అన్నదానం జరుగుతుండేది.ఒక రోజు పగలు 12 గంటలకు సోమయాజులు శిష్యులు అగ్నిహోత్రంలో హవిస్సు వేస్తుండగా,కమండలం ధరించి కాషాయ వస్త్రాలలో ఒకరు ఇంటికి వచ్చారు.వారి ముఖంలో దివ్య తేజస్సు కనబడుతున్నది.ఆ సన్యాసిని చూసి శిష్యులు ఆశ్చర్యపోయినారు.సోమయాజులు గారు లేచి సాష్టాంగ ప్రణామాలు చేశారు.భోజన సమయం అయినది భిక్ష తీసుకోని సేద తీర్చుకోమన్నారు.మంథని గోదావరిలో స్థానం చేసి గౌతమేశ్వరున్ని దర్శించుకొని కాళేశ్వరం వెళ్లాలన్నారు.కాళేశ్వర ముక్తేశ్వరులకు అభిషేకం చేసి తిరిగి భోజనం కాశి లో చేస్తా అని వెళ్ళాడు.ఆ సన్యాసి ఎవరో కాదు సాక్షాత్తు దైవ స్వరూపం అయిన వాసుదేవానంద సరస్వతి.ఆయన సంధి మలుపు వరకు సోమయాజులు మరియు శిష్యబృందం అనుసరించారు.వెనుతిరిగి చూసే సరికి మాయమైపోయినారు.కాలినడకన కాళేశ్వరం ఎలా సాధ్యం?అది మధ్యాహ్నం వరకు ఎలా సాధ్యం అని శిష్యులు అలోచించి ఎడ్లబండిల పైన కాళేశ్వరం వెళ్లారు.కాళేశ్వరం వెళ్లే సరికి మధ్యాహ్నం 2 అయింది .అక్కడి అర్చకులతో అయ్యా ఎవరైనా కాషాయ వస్త్రాలతో వచ్చారా అని అడిగారు దానికి సమాధానంగా అక్కడి పూజారి ఆ వచ్చారు ఎవరో వాసుదేవ సరస్వతి అట అని చెప్పారు.అది విన్న సోమయాజులు గారి శిష్యుల ఆనందానికి అవధులు లేకుండా పోయినవి.ఇప్పటికి వారు మాయమైన స్థలం మంథనిలో కనబడుతుంది.అంతటి మహానుభావుని పాదధూళి సోకిన మన మంథని మహాభాగ్యమని కొనియాడారు.సాక్షత్తు అది శంకరచార్యులు మంథని ని ధర్మ పీఠమని బిరుదునొసగారు.

You are able to post comments by logging in through facebook.

comments

Share.

About Author

Comments are closed.