Vasavi Kanyaka Parameshwari Temple

మంథని లోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయ నిర్మాణ విశేషాలు :

మంథని గ్రామమునకు దక్షిణమున ఉన్న వాగుగడ్డ వైపు ఆర్య వైశ్య సామాజిక వర్గానికి చెందిన 60% కుటుంబాలు వెలసి ఉన్నందున ఈ ప్రాంతానికి 1970 దశకంలో వాసవి నగర్ అని నామకరణం చేసి తమ కుల దైవం కు ప్రాముఖ్యత ఇచ్చారు. విరి ద్వారానే క్రయ విక్రయ కేంద్రాలు మంథని ప్రాంతము లో వెలసినవి .ఈ కారణముగా తమ ఆరాధ్య కులదైవం అయిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం ఎప్పటికైన నిర్మించాలని ప్రగాడ కోరికగా వుండేది .ముఖ్యంగా ఆనాడు వైశ్య సంఘము లో ప్రముఖ పాత్ర పోషించిన ఉపాధ్యాయులు కొమురవెల్లి తిరుపతి గారు ,రావికంటి రామయ్య గుప్త గారు , వోల్లల కిష్టయ్యలె గాక తదితర వైశ్య సంఘము సభ్యులు దొంతుల శంకరయ్య , రాజ లింగయ్య సహోదరులు , రేపాల కిష్టయ్య సహోదరులు ,ఇంజనీర్ కుక్కడపు బుచయ్య మరియు తదితర దేవాలయ నిర్మాణ ఆకాంక్షితులు అయిన వైశ్య సోదరులు నిర్ణయానికి వచ్చారు .అనేక తర్జన బర్జనల అనంతరం ప్రస్తుతం వాసవినగర్ గా పిలవబడే ప్రాంతము లోనే ఆలయము నిర్మించాలని నిర్ణయించుకున్నారు . ఆనాడు గ్రామ ప్రథమ పౌరుడు శ్రీ ముక్క వీర రాఘవులు ఆయన సహోదరుడు రమేష్ కృషి ఫలితముగా నామమాత్రపు రుసుము చేలించునట్లు దేవాలయ నిర్మాణానికి కావల్సిన 40′ * 30′ జాగాను జిల్లా కలెక్టర్ గారు అనుమతించారు .వెంటనే వైశ్య సంఘము వారు దేవాలయ నిర్మాణాన్ని తీర్మానించారు .ఇందులకు వోల్లల మధుమోహన్, కొమురవెల్లి సమ్మయ్య, వైశ్య సంఘము ఆర్థిక కార్యదర్శి రావికంటి సమయ్య లను నిర్మాణ కమిటి ఏర్పాటు చేసి అవసరమైన అధికారాన్ని ఇచ్చారు . వీరికి అండగా మిగతా వైశ్య సహోదరులు ఏక కంటముగా సహకరించుటకు ఒప్పుకున్నారు . తధనుసారము కరీంనగర్ లోని యజ్ఞ వరాహ స్వామి మందిర వ్యవస్తాపకులు బ్రహ్మ శ్రీ భాష్యం విజయసారధి గారి సారధ్యములో శిలన్యాస కార్యక్రము చేపట్టుట జరిగింది .ఆనాటి సుముహూర్తం భవనామ సంవత్సరం పాల్గుణ శుద్ధ విదియ ,ఉత్తరాబాద్ర నక్షత్రయుక్త   సుముహూర్తం శుక్ల వారం ఉదయం 11-40 నిమిషాలకు రత్నగర్భ గణపతి శ్రీ నగరేశ్వ్వర స్వామి ఉపాలయలతో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఆలయానికి శిలన్యాసము జరిగింది . ఆ కార్యక్రమునకు వైశ్య సంఘము పెద్దలు శ్రీయుతులు దొంతుల శంకరయ్య దంపతులు ,కొమురవెల్లి తిరుపతి దంపతులు, ఇంజనీర్ కుక్కడపు బుచయ్య దంపతులు ,రేపాల కిష్టయ్య దంపతులు అర్చన కార్యక్రమాలు నిర్వహించారు .ఆనాటి ముహూర్త బలమో ? వైశ్య సోదరుల సంకల్ప బలమో ? 9 నెలల అల్ప కాలంలోనే దేవాలయ నిర్మాణం జరిగింది .ఈ విధముగా సాధించిన ఘన విజయాన్ని ఉత్సవముగా మార్చుటకు విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రములు జరుపుటకు నిచ్చయించారు . ఇందులకు యువనామ సంవత్సరము మార్గశిర శుద్ద చవితి ఆదివారం తేది 26-11-1995 నుండి పూజ కార్య క్రమాలు నిర్వహించి తేది 01-12-1995 యువనామ సంవత్సరము మార్గశిర దశమి శుక్ల వారము ఉదయము 11-30 నిమిషాలకు ఉత్తరాబాద్ర నక్షత్ర యుక్త మకర లగ్న సుముహుర్తమున ప్రతిష్టాపన కార్య క్రమాలు జరిగాయి .శిలన్యాసం ,ప్రతిష్టాపన కార్య క్రమాలు కూడా శుక్ల వారం ఉత్తరాబాద్ర నక్షత్రము లో జరుగడం విశేషం .ఇందులకు తెలుగునాట ఉన్న ప్రముఖ వేదాంత వేత్తలు ప్రధాన ఋత్వికులు శ్రీ భాష్యం విజయ సారధి గారి నేతృత్వం లో అంగరంగ వైభవముగా నిర్వహించారు .ప్రతి నిత్యం అన్నదానాలు జరిగాయి .అప్పటి ప్రధాన కార్యదర్శి కొమురవెల్లి తిరుపతి ఉపాధ్యాయులు 120 దినములు పూజా కార్యక్రమాలు నిర్వహించారు .ఇప్పటికి ఇతని సలహా సహకారాలతో ఉత్సవాలు జరుగుతున్నాయి . ఈ దేవాలయం లో ప్రతి సంవత్సరం ఉగాది నాడు పంచాంగ శ్రవణం ,ప్రత్యేక పూజలు ,వైశాక శుద్ద దశమి నాడు శ్రీ వాసవి మాత జయంతి , శ్రావణ మాసము అభిషేకాలు ,కుంకుమ పూజలు ,వరలక్ష్మి వ్రతాలు,బాద్రపద మాసము లో వినాయక నవరాత్రులు ,అశ్విజ మాసం లో శరన్నవరాత్సోవాలు ,అశ్విజ మాసం పౌర్ణమి రోజు కొజాగిరి వ్రతము , దీపావళి నాడు శ్రీ లక్ష్మి సరస్వతి పూజలు సాముహికంగాను ,కార్తిక మాసం లో శివాభిషేకాలు , బిల్వ పత్రపూజ, సాముహిక సత్యనారాయణ వ్రతాలు, వన భోజనాలు, మార్గశిర శుద్ద ఏకాదశి గీతా జయంతి, మార్గ శుద్ద విదియ శ్రీ వాసవి ఆత్మార్పణదినము,మహా శివరాత్రి రోజు లింగోద్భవ కాలమున వివిధ రకాల పూజ కార్యక్రమాలు జరుగుతాయి .ఇంతేకాక ప్రతి సాయంత్రము సాముహిక లలితా పారాయణము ,ప్రతి శుక్ల వారము సాముహిక మంగళ హారతులు ,రాత్రి భజన కార్యక్రమము జరుగుతాయి .

అమ్మవారి దేవాలయం నిర్మితము అయితదో కాదో అనుకున్న సందర్భాలు ఉన్నాయి . కాని ప్రతిష్టనంతరం అమ్మవారి పరిపూర్ణ కటాక్షాల వల్ల చుట్టూ ప్రక్క నివాస గృహాల వారు స్వచ్చదంగా అమ్మవారి గుడిని అభివృద్ధి పరుచుటకు స్థలాలను సమర్పించారు .ప్రస్తుతం అమ్మవారి దయ వలన మంథని గ్రామము లోనే సుందరమైన శ్రీ వాసవి కళ్యాణ మంటపం తయారయినది . ఆ అమ్మ వారి దయ సదా అందరి ఫై ఉండాలని మా ప్రార్థన .ఈ దేవాలయ చరిత్రను కొమురవెల్లి తిరుపతి గారు మరియు ఆర్య వైశ్య మిత్రుల సహాయ సహకారాలతో మన మంథని వెబ్ సైట్ (www.manamanthani .com) నిర్వాహకులు శ్రీ చక్రగారి అరుణ్ కుమార్ సేకరించటం జరిగింది .