శ్రీపాద ఎల్లంపల్లిలో జూన్ 1నుంచి నీటి నిల్వ

0

ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులో జూన్ ఒకటి నుంచి నీటిని నిల్వ చేయనున్నట్లు ప్రాజెక్టుల చీఫ్ ఇంజనీర్ అనిల్‌కుమార్ వెల్లడించారు. ఎల్‌ఎండీకాలనీలోని ప్రాజెక్టుల చీఫ్ ఇంజనీర్ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎల్లంపల్లి రిజర్వాయర్ పూర్తి సామర్థ్యం 20.175 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 3.65 టీఎంసీల నీరు నిల్వ ఉందని తెలిపారు. జూన్ 1 నుంచి ప్రాజెక్టుల్లో నీటిని నిల్వ చేసేందు కు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు పరిధిలో కరీంనగర్ జిల్లాలోని 12 గ్రా మాలు, ఆదిలాబాద్ జిల్లాలోని తొమ్మిది గ్రామా లు ముంపునకు గురవుతున్నాయని పేర్కొన్నా రు.

ఇందులో కరీంనగర్‌లో ఎనిమిది గ్రామాల ను ప్రజలు ఇప్పటికే ఖాళీ చేశారని పేర్కొన్నారు. కాగా చెగ్యాం, ఉండేడ, కోటిలింగాల, మొక్కట్రావ్‌పేట గ్రామాల్లోని ప్రజలను కూడా యుద్ధప్రాతిపదికన తరలించాలని ముఖ్యమంత్రి ఆదేశించిన ట్లు తెలిపారు. అలాగే ఆదిలాబాద్ జిల్లాలో నా లుగు గ్రామాలు ఇప్పటికే ఖాళీ కాగా, మరో ఐదు గ్రామాలను ఖాళీ చేయాల్సి ఉందని తెలిపారు. ఇందుకోసం నిర్వాసితులను ఖాళీ చేయించేం దుకు తగిన చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన వివరించారు.

రాయపట్నం వంతెన పనులు వే గవంతం చేస్తున్నామని చెప్పారు. మధ్యమానేరు ప నులను వేగవం తం చేసేందుకు కృషిచేస్తున్నామనీ, ఈమేరకు అధికారులు, సంబంధిత ఏజెన్సీలతో ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మధ్యమానేరు కుడిభాగంలో చేపడుతున్న పనులను అనుకున్న సమయానికి చేయకపోవడంతో వైఐపీఎల్, కేజేపీపీఎల్(జేవీ) పూణేకు సంబంధించిన ఒప్పందాలను రద్దు చేసి కొత్తగా శ్రీ రాజరాజేశ్వర కన్‌స్ట్రక్షన్ కంపెనీ(ఎస్‌ఆర్‌ఆర్‌సీ)కి అప్పగించినట్లు ఆయన తెలిపారు.

రూ.117.72 కోట్లతో చేపడుతున్న ఈ పనుల్లో ఇప్పటివరకు రూ.11 కోట్ల విలువైన పనులు మాత్రమే చేశారని, వీటిని పూర్తిచేసేందుకు సంబంధిత కాంట్రాక్టర్‌ను మార్చి కొత్తవారికి ఇచ్చినట్లు తెలిపారు. మధ్యమానేరు పూర్తిస్థాయి నీటిమట్టం 25.875 టీఎంసీలు కాగా ఈ ఏడాది 2.5 టీఎంసీల నీటి నిల్వ చేయనున్నట్లు ఆయన తెలిపారు. తోటపల్లి, లింక్ కెనాల్ పనులను ప్రా రంభించామనీ, ఈ పనులను త్వరితగతిన పూర్తి చేయనున్నామని సీఈ తెలిపారు.

You are able to post comments by logging in through facebook.

comments

Share.

Comments are closed.