గ్రామస్థులకు అండగా శ్రీధర్ బాబు

0

మంథని నియోజకవర్గంలోని పలు గ్రామాలకు తిరుగుతూ ప్రజల కష్టాలు తెలుసుకుంటూ అండగా నిలుస్తున్నారు మాజీ మంత్రి శ్రీధర్ బాబు.రాజకీయాల్లో గెలిచిన ,గెలవకున్న ప్రజలకు శ్రీపాద కుటుంబం అండగా ఉంటుందని గ్రామస్థులకు భరోసా ఇస్తున్నారు.ఎన్నికలు అయిపోయిన  నెల రోజులనుండి దాదాపు ప్రతి నెల 25 రోజులు గ్రామాల్లో తిరుగుతూ ప్రజల కష్టాలు తెలుసుకుంటూ ముందుకు కదులుతున్నారు. ఈరోజు ముత్తారం మండలంలోని   మైదంబండ గ్రామానికి చెందిన బూడిద శంకర్‌ ఇటీవల వ్యవసాయ పొలంలో గుండెపోటుతో మృతి చెందగా మృతుని కుటుంబాన్ని పరామర్శించారు. అలాగే హరిపురం గ్రామానికి చెందిన శీపెల్లి రాజీరు అనారోగ్యంతో బాధపడుతుండగా ఆయనను పరామర్శించారు. ఆయన వెంట జడ్పీటీసీ చొప్పరి సదానందం, జిల్లా అధికారప్రతినిధి బీవీ స్వామిగౌడ్‌, శశిభూషణ్‌కాచే, అజీంఖాన్‌, జంగమోహన్‌రెడ్డి, బియ్యని శివరాజబాబు, సింగిల్‌ విండో డైరెక్టర్‌ మెంగాని తిరుపతి, యార రాజయ్య, మహేందర్‌ , బూడిద శ్రీనివాస్‌, తదితరులు ఉన్నారు.

You are able to post comments by logging in through facebook.

comments

Share.

About Author

Comments are closed.