మంథని జిల్లాగా చేయాలి…శ్రీధర్‌బాబు

0

మంథనిలోశ్రీధర్‌బాబు శనివారం విలేకరులతో మాట్లాడారు. ఎస్సారెస్పీ, ఎల్లంపల్లిలో నీరున్నా ఎందుకు విడుదల చేయడం లేదని ప్రశ్నించారు. ఆయకట్టు భూములు ఎండిపోతున్నాయని నీళ్లున్నా పంటలను కాపాడడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. సాగునీరు విడుదల చేయాలని అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదన్నారు. ఎల్లంపల్లి నుంచి రెండు టీఎంసీల నీరు విడుదల చేస్తే ముత్తారం, కమాన్‌పూర్‌, మంథని మండలాలకు సాగునీరందే అవకాశం ఉందన్నారు. రూ.లక్షలోపు రుణాలు మాఫీ కాక రైతులు ఆవేదనలో ఉన్న తరుణంలో కాలువల ద్వారా నీరు రాకపోవడం మరింత కుంగదీస్తుందని పేర్కొన్నారు. ఎల్లంపల్లి నుంచి ఇప్పటికే రెండుసార్లు వెంటనే సాగునీరు విడుదల చేసి రైతులను ఆదుకోవాలన్నారు. ఎస్పారెస్పీ నీటి విడుదలకు సమన్వయ కమిటీని నియమించి సమస్యలు లేకుండా చూడాలన్నారు. చరిత్ర, సహజ వనరులను పరిగణలోకి తీసుకుని మంథని జిల్లా చేయాలని శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. మంథని నియోజకవర్గంలో బొగ్గునిక్షేపాలు, అటవీసంపద, జలసంపద ఉన్నాయని, ఎంతో చరిత్ర ఉందన్నారు. మంథని జిల్లా ఏర్పడితే తెలంగాణకే తలమానికంగా ఉంటుందన్న విషయాన్ని తాము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా తీరా ప్రజలు కోరని పెద్దపల్లిని ప్రకటించడం విస్మయాన్ని కలిగించిందన్నారు. అభివృద్ధికి దూరంగా ఉన్న ఏడు మండలాలతో రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటు చేస్తే ఇప్పుడు విభజించడం సరికాదన్నారు. దీనివల్ల భవిష్యత్తులో మంథని ఉనికి ప్రశ్నార్థకం కానుందన్నారు. ఏడు మండలాలను ఒకే డివిజన్లో ఉంచాలన్నారు. అదనంగా ప్రకటించనున్న జిల్లాల్లో మంథనికి స్థానం కల్పించాలన్నారు.

You are able to post comments by logging in through facebook.

comments

Share.

Comments are closed.