Sri Rama krishnandha Ashramam Manthani

0

హరేరామ హరేరామ రామరామ హరేహరే
హరేకృష్ణ హరేకృష్ణ కృష్ణకృష్ణ హరేహరే

ఇది షోడసాక్షర మహామంత్రము.ద్వాపర యుగ చివరన త్రిలోక సంచారి నారదుడు ,బ్రహ్మ వద్దకు వెళ్ళి మహత్మా!నేను భూమండలమున సంచరించుచు పాపమును ఎట్లు దాటగలనో వచింపుడని అడుగగా ,బ్రహ్మ ఇట్లు వచించెను.నారదా! కలియుగంలో సమస్త వేదముల సంసార తరుణోపాయం భగవంతుని నామస్మరణ.ఆ నామమే షోడసాక్షర మంత్రం.కృతాయుగంలో అవతరించిన హరినామములు ఎనమిది ,త్రేతాయుగంలోని రామనామములు నాల్గు ,ద్వాపరయుగంలోని కృష్ణుని నామములు నాల్గుతో ఏర్పరిచిన బీజాక్షర సమన్వితమైన మహామంత్రము.తెల్సితెలియక ,శుధ్ధంగా లేక అశుధ్ధంగా గాని ఎలాటి సమయంలోనైనను కీర్తించిన ,జపించిన ,ధ్యానించిన మానవుని సమస్త పాపములు నశించి మోక్షమొందును.

ఇట్టి మహామత్రము ద్వార మంథని ప్రజల నుద్దరించుటకై ,తరింపజేయుటకై ” శ్రీ శ్రీ శ్రీ రామకృష్ణానంద స్వాములవారు 02-05-1965 న మంథని వచ్చి 25-04-1984 లో ఆశ్రమమును స్థాపించి ఎందరికో దీక్ష,ఉపదేశములనొసంగి 45 సం.లు నామ సంకీర్తనతో ఎందరినో తరింపజేశారు.

ఇప్పటికిని శ్రీమతి భారతుల పార్వతి గారు,శ్రీ సువర్ణ లింగయ్య గారు,శ్రీ రామడుగు ప్రభాకర్ గారు మరియు మొదలగు భక్తులు ఈ హరే రామ ఆశ్రమంలో వివిధరీతులలో భజనలు,కీర్తనలు,నామస్మరణలు మరియు గీతాపారాయణములతో పాటుగా దాతలు కొమురవెల్లి ధనంజయ గారు మరియు వొల్లాల సత్యనారాయణ గార్ల ఆధ్వర్యంలో అన్నసంతర్పణలు కూడా జరుగుతున్నవి.

దర్శించండి…తరించండి.

– రామడుగు వేణుగోపాల్

You are able to post comments by logging in through facebook.

comments

Share.

About Author

Comments are closed.