రఘునాథ్ కాచే గారు

0

కరీంనగర్ జిల్లాలో సత్యగ్రహ ఉద్యమంలో పాల్గొన్న తొలి జిల్లా వాసి మన మంథని రఘునాథ్ కాచే గారు.ఉస్మానియా విశ్వ విద్యాలయంలో తొలి పట్టా పొందిన మంథని వాసిగా వీరికి గుర్తింపు ఉన్నది . నిజాం పాలనకు వ్యతిరేకంగా, హైదరాబాద్ రాష్ట్ర కాంగ్రెస్ శంఖారావం పూరించిన కాలంలో రఘునాథ్ కాచే గారు కాంగ్రెస్ జిల్లా అధ్యక్షునిగా ఉన్నారు. సత్యాగ్రహం చేసి నిజామాబాదు జిల్లాలో 9 మాసాలు జైలు శిక్ష అనుభవించారు. నిజాం కాలంలో రక్షిత కౌలు దారు చట్టం సబ్యునిగా వ్యవహరిచారు .

భూస్వాముల భూములు సాగు చేసుకున్న వారికి  యాజమాన్య హక్కులు వచ్చెల కృషి చేసారు. ప్రధాని పి.వి నరసింహారావు అమలు చేసిన భుసంస్కరణ చట్టంలోని  వీదివిధానాల రూపకల్పనలో కీలకముగా వ్యవహరించారు.

మంథనిలో 1947 ఆగష్టు 15 న త్రివర్ణ పతాకంతో,  “హైదరాబాద్ రాష్ట్రము” ఇండియన్ యునియన్ లో చేరాలని నినదించారు. ఫలితముగా 8 నెలల కారాగార జైలు శిక్ష అనుభవించారు. రఘునాథ్ కాచే కృషికి గుర్తింపుగా 1947 ఆగష్టు 15న ఢిల్లీ లో అప్పటి ప్రధాని చేతులమీదుగా తామ్రపత్రం అందుకున్న మొదటి మంథని వాసిగా కీర్తి ప్రతిష్టలు పెంచారు .

You are able to post comments by logging in through facebook.

comments

Share.

Comments are closed.