శని త్రయోదశి సందర్భముగా కాళేశ్వరంలో నవగ్రహ పూజలు

0

శని త్రయోదశి సందర్బముగా కాళేశ్వరం భక్తులతో కిట కిట లాడింది .అనేక మంది భక్తులు ఇతర రాష్ట్రాల నుండి కూడా వచ్చి నవగ్రహ పూజలు చేసుకున్నారు.శని త్రయోదశి చాల దివ్యమైన రోజు అని కాళేశ్వర ఆలయ పండితులు చెప్పారు.ఈ రోజు నవగ్రహ పూజలు చేస్తే శని తోలుగుతుందని ఆలాగే మన ఇంటి ముందుకు వచ్చిన గోమాతను (ఆవులకు) దాన వేయాలని,ఆవులో 30 కోట్ల దేవతలు ఉంటారని ప్రతి రోజు గోసేవ చేయాలనీ చెప్పారు.

ఈ శనివారం చాలా విశేషమైన రోజు.జేష్ఠ మాసంలో శుద్ధ త్రయోదశి శనివారం రోజున రావడం వలన శని త్రయోదశి చాలా విశేషతను సంతరించుకుంది.శని ఆధిపత్యం వహించే అనురాధా నక్షత్రం ఉన్న వృశ్చికరాశిలో జేష్ఠ మాసంలో ప్రస్తుతం శని సంచారం జరుగుతున్నది.

చదువుల్లో వెనుకబడిన విధ్యార్ధులు,పెళ్ళి ఆలస్యం అవుతున్నవారు,సంతానం కోసం ఎదురు చూసేవారు,వివిధ రకాల వ్యాధులచే బాధపడేవారు ఈ విశేష శని త్రయోదశి రోజున శ్రీ శని భగవానుని పూజించి వారి అనుగ్రహం పొందగలరు.

ఈ శని త్రయోదశి రోజున చేయవలసిన కార్యక్రమాలు

1) శ్రీ శని భగవానునికి తైలాభిషేకం
2) నేలపై నల్ల నువ్వులు పరచి మధ్యలో నువ్వులనునెతో దీపారాధన
3) ఈ రోజున సాయంత్రం వరకు ద్రవ పదార్ధాలు ( పాలు,పండ్ల రసాలు ) మాత్రమే తీసుకుంటూ ఉపవసించుట
4) కాకులకు ఆహారం పెట్టుట
5) శక్తి కొలది అన్నదానము చేయుట
6) అంగవికలురికి ధన సహాయము లేదా ఆహారము పెట్టుట
7) శ్రీ హనుమాన్ చాలీసా చదువుట
8) ప్రదోష వేళలో శివారాధన

You are able to post comments by logging in through facebook.

comments

Share.

Comments are closed.