సాయి గంగా మహాదేవ్

1

జననం:

11/09/1962 ప్లవనామ సంవత్సరం మాఘశుద్ధ సప్తమి (రథ సప్తమి) ఆదివారం భరణి నక్షత్రం రెండవ పాదాన శ్రీమతి రాధమ్మ శ్రీ  సీతారాం పుణ్యదంపతులకు మహాదేవ్ రెండవ కుమారుడిగా జన్మించారు.పువ్వు పుట్టగానే పరిమళించినట్టు చిన్నతనం నుండి దైవభక్తి,పెద్దల పట్ల గౌరవం,వినయం కలిగి ఉండేవారు.చదువులో గంగా మహాదేవ్ గారు ఏకసంతాగ్రహి.లౌకిక విద్య కంటే పారమార్థిక విషయాలపై మొగ్గు చూపేవాడని అతని మిత్రుల ద్వారా మనమంథని వెబ్సైటు సేకరించింది.

విధ్యాభ్యాసం:

పదవతరగతి పూర్తికాగానే ఇంటర్మీడియట్ ఎంపీసీ లో చేరాడు.ఇంటర్ లో కూడా ఫస్ట్ క్లాస్ లో పాస్ అయినాడు.విరామం దొరికినపుడు దేవాలయాకు వెళ్లడం,ధ్యానం చేయడం చేసేవాడు.తోటివారు గద్దెల మీద ముచ్చట్లు పెడుతున్న,వాగులో మరియు గ్రౌండ్ లో ఆటలు ఆడుతున్న వాటిపై ఆసక్తి చూపేవాడుకాదు.లైబ్రరీలో మహాత్ముల జీవిత చరిత్రలు తెచ్చుకొని చదివేవాడు.వారి జీవిత చరిత్రలో మంచి విషయాలను గ్రహించి అవి ఆచరణలో పెట్టేవాడు.అప్పుడే మంథనికి వచ్చిన హరే రామ భజన చేయిస్తున్న రామకృష్ణానంద స్వామితో గడిపేవాడు.చిన్న చిన్న భజన పాటలు కుడా రాశాడు.గంగా మహాదేవ్ కు భగవద్గిత అంటే చాల ఇష్టం.ప్రతి శ్లోకం దాని భావం పుస్తకం చూడకుండా చెప్పేవాడు.

ఇంజనీరింగ్ విద్య :

గంగా మహాదేవ్ కు ఇంజనీరింగ్ లో సిటువచ్చింది .బంధువులంతా సంతోషించారు.కానీ మహాదేవ్ కు ఎదో అసంతృప్తి.ఇంకేదో చేయాలనే తపన.అదే ధ్యాసతో ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ పూర్తి చేసి రెండవ సంవత్సరంలో చేరాడు.తరవాత కొన్ని రోజులకు అస్వస్థకు లోనైనాడు.ఒక గదిలో ప్రశాంతముగా పడుకున్నాడు.మనసు పరిపరి విధాలుగా ఆలోచిస్తున్నది.అందరిలా నేను ఇంజనీరింగ్ కావాలా?ఆ తరవాత సంసారం కూపంలో పడిపోవాలా?తాతా,తండ్రి ల ఆస్థి ఉంది.నేను డబ్బుకు దాసోహం అయ్యి సంపాదించాలా? నా జీవిత పరమార్థం ఇదేనా? దేవుడు నన్ను భూమి మీద పుట్టించింది డబ్బు సంపాదించుకొనుటకా? అని తనకు తానే ప్రశ్నలు వేసుకున్నాడు.విపరీతమైన తలనొప్పి.ఎదరుగా గోడకు వేలాడుతున్న సాయిబాబా ఫోటో ప్రక్కనే భగవద్గిత పుస్తకం.అంతే అక్షణమే భగవద్గిత లోని సారాంశాన్ని ప్రజలకు భోధిద్దామని అనుకున్నాడు.ఇంజనీరింగ్ విద్య రెండవ సంవత్సరంలో డిస్ కంటిన్యూ  చేశాడు.భారత దేశంలోని ప్రతి ప్రదేశం తిరిగాడు.భగవద్గిత సారాంశాన్ని తెలియజేశాడు.డబ్బే జీవితం కాకూడదని చెప్పాడు.కర్నూల్ లో సత్యసాయి బాబా మహిమలు విన్నాడు.పుట్టపర్తి పోవాలనుకున్నాడు.దసరా సెలవుల్లో తోటి వారందరు ఇంటికి  వచ్చారు.కానీ మహాదేవ్ రాలేదు.తల్లి చాల కలవరపడింది.విజయ దశమి నాడు సత్యసాయి బాబాను దర్శించారు.ఆయన సృష్టించిన విభూతి మహాదేవ్ కు నుదిటి పై పెట్టాడు.ఏదో తెలియని శక్తి మహాదేవ్ లో, సత్యసాయి లోని సేవ మార్గాన్ని  ఎంతో మందికి త్రాగునీరు,చదువు ఉచితంగా చెప్పేస్తున్నా సాయి తత్వాన్ని సర్వజగత్తుకు చాటాలని సంకల్పించాడు.చదువుకు స్వస్తి చెప్పాడు.సర్వం సాయి మయంగా భావించాడు.సాయి గంగా మహాదేవ్ గా మారాడు.

మానవ సేవే మాధవ సేవ :

అతి చిన్న వయసులో మేధావులు సైతం ముక్కు మీద వేలువేసుకునే లాగ ఉపన్యాసాలు ఇచ్చేవాడు.భగవద్గిత లోని ప్రతి అక్షరం దాని భావం తన ఉపన్యాసంలో చెప్పేవాడు.భగవద్గిత అర్థం చేసుకుంటే మనసు ప్రశాంతంగా ఉంటదని,అందరిని భగవద్గిత చదవాలని ప్రేరేపించేవాడు.మంథని లో సాయి సదనం అద్భుతంగా నిర్మించి దేశంలో మొట్ట మొదట సత్యసాయి బాబా విగ్రహాన్ని 1998 మే 18 తేదీన ప్రతిష్టించాడు.మహాదేవ్ దృష్టిలో సేవ చేసేవారే దేవుడు.షిర్డీ సాయి – సత్య సాయి ఒకరే అని చెప్పేవాడు.అదే పేరుతో పుస్తకం కుడా రాసాడు.సత్య సాయి సూక్తులు ఆధారంగా సత్యసాయి దివ్య తరంగాలు అనే పుస్తకం రాశాడు.తెలుగు నుండి ఇంగ్లీష్ లో అనువదించాడు.ఇతర దేశాలలో కూడా ఈ బుక్ చాల మంది తీసుకోని చదివారు.

తుది శ్వాస:

హైద్రాబాద్ శ్రీనగర్ కాలనీలోని సత్యసాయి నిగమాగమంలో 20/01/1997 న అద్భుతమైన ఉపన్యాసమిచ్చాడు.అదేరోజు మాతృమూర్తి తోని మంథనికి కారులో వస్తుండగా కారు ప్రమాదానికి గురి అయ్యి కన్ను మూశారు.మంథని మొత్తం దుఃఖంలో మునిగింది.మంథని లో ప్రతి ఒక్కరి మదిలో  గంగా మహాదేవ్ గారు ఉంటారు.గంగా మహాదేవ్ అంటే సేవ,సేవ అంటే గంగా మహాదేవ్ అంటారు.ఇప్పటికి వారి కుటుంబ సభ్యులు పేద విద్యార్థులకు పుస్తకాలు పంచిపెట్టడం,రోగులకు ఉచితముగా మందులు పంపిణి చేయటం. సేవా మార్గంలో నడుస్తూ పది మందికి ఆదర్శముగా నిలుస్తున్నారు.నీకున్న సంపదలో ఒక పది శాతం ఆయన ఆకలితో అలమటిస్తున్న ని తోటి మానవులకు ఇవ్వటమే సాయి తత్వమని,ఎన్నో మంచి విషయాలు ఉన్న భగవద్గిత ను చదివి ఆచరించారని కోరేవారు. 

You are able to post comments by logging in through facebook.

comments

Share.

1 Comment

  1. చాలా ఆనందమైంది! ఆ మహావతారం యొక్క మహిమలు చెప్పుకోవాలంటే ఓక్క జన్మ సరిపోదు! ‘ప్రేమ ఏవ నియమః” అనే సూత్రాన్ని పాఠించి నిజ జీవితంలో నిరూపణ చేసిన త్యాగ అవతారం ఆయన!!!