Rural Sport Looks For Government Support

0

లక్ష్యం స్పష్టంగా ఉంటె గురి చూడడము ఏమాత్రం కష్టం కాదు. సరైన లక్ష్యాన్ని చిన్నప్పటి నుండి ఎంచుకుంటే గమ్యం చేరటం తద్యం. దానికి కావాల్సిందల్ల మొక్కవోని పట్టుదల, కృషి. ఈ రెండు తోడైతే విజయతిరాలకు చేరువైనట్లే. మంథని కి చెందిన పూజ మృణ్మయి కూడా తనకంటూ చిన్నప్పటి ఒక లక్ష్యం పెట్టుకొని సాధన వైపు అడుగులు వేస్తుంది. తన పట్టుదల కి గవర్నమెంట్ స్కూల్ స్పోర్ట్స్ టీచర్ గా పనిచేస్తున్న తండ్రి ప్రోత్సాహం తోడైంది. ఈ చిన్నారి అర్చరి (విలువిద్య )ను చూసి మన మంథని వాళ్ళు చాల ఆనందం వ్యక్తం చేసారు. మంథని లో ఉండే ప్రతి వాళ్ళు తమదైన నైపుణ్యం తో మంథని కి మరియు వారి తల్లి తండ్రులకు కీర్తి ప్రతిష్టలు పెంచాలి,ఆలాగే ప్రతి ఒక్కరు మన మంథని అభివృద్ధి లో పాలుపంచుకోవాలి .

మన మంథని కి చెందిన కొమురోజు శ్రీనివాస్,హరిత దంపతుల ఇద్దరు పిల్లలో పెద్ద అమ్మాయి పూజ మృణ్మయి. చదువులో కూడా చురుకుగా ఉండే పూజ ప్రతి రోజు గంట సమయాన్ని అర్చరి కోసం కేటాయించేది. తన తండ్రి సలహాలను పాటిస్తూ అర్చరి (విలువిద్య)లో ఎన్నో మెలుకువలు నేర్చుకోనేది .

జిల్లా లోనే ప్రథమ స్థానము

తండ్రి కి తగ్గ తనయురాలుగా మొదటి ప్రయత్నము లోనే అత్యుతమ ప్రతిభ కనబరచి మన జిల్లాకు మరియు ముఖ్యంగా మన మంథనికి పేరు తెచ్చింది. ఆ తరవాత జాతీయ స్థాయి పోటిలలో ఎనిమిది జిల్లాల నుండి అండర్ 14 కు పోటి పడ్డ మన పూజ వందల సంఖ్యలొ ఉన్న పోటిదారులను అధిగమించి నేషనల్ గేమ్స్ కు ఎంపిక అయింది. నేషనల్ కు సెలెక్ట్ కావడముతో భాద్యత మరింత పెరిగిందని గ్రహించిన పూజ సెలవు రోజులో కూడా నిత్యమూ తన సమయాన్ని అర్చరి కి కేటాయించింది. జాతీయ మరియు అంతర్జాతీయ స్తాయి లో తెలంగాణా జెండా ఎగిరవేసి మన మంథని కి పేరు ప్రతిష్టలు తేవటమే లక్ష్యముగా పెట్టుకొన్నది. అయితే అర్చరి పరికరాలు చాల ఖరిదు. ఈ తండ్రి తనయురాలుకు పరికరాలు ప్రభుత్వం సమకుర్చితే మరింత మంది గ్రామీణ ప్రాంతాల లో ఉన్న వారు వెలుగులోకి వస్తారని అభిప్రాయము .

You are able to post comments by logging in through facebook.

comments

Share.

About Author

Comments are closed.