రేపాల వైకుంఠం జ్ఞాపకార్థం ఆంబులెన్స్‌

0

మల్హర్‌ మండల కేంద్రంలోని తాడిచెర్ల గ్రామంలో రేపాల రమేశ్‌ తన తండ్రి వైకుంఠం జ్ఞాపకార్థం ప్రారంభించిన ఆంబులెన్స్‌ సేవలను ఎమ్మెల్యే పుట్ట మధుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రజలకు అత్యవసర సమయాల్లో ఎంతో ఉపయోగపడే ఆంబులెన్స్‌ను రమేశ్‌ సమకూర్చడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ ఆకుల కిరణ్‌, జడ్పీటీసీ గోనె శ్రీనివాసరావు, మండల పార్టీ అధ్యక్షుడు తాజోద్దీన్‌, సర్పంచ్‌ మోహన్‌రావు, టీఆర్‌ఎస్‌ నాయకులు యాదగిరిరావు, మంథని సమ్మయ్య, అజ్మీరా బాలాజీ, సది తదితరులు పాల్గొన్నారు.

You are able to post comments by logging in through facebook.

comments

Share.

About Author

Comments are closed.