రావికంటి రామయ్యగుప్త

రావికంటి రామయ్యగుప్త తెలంగాణకు చెందిన తెలుగు కవి. కరీంనగర్ జిల్లా మంథని ప్రాంతానికి చెందినవాడు.మంథని పట్టణంలోని దొంతుల వాడకు చేందిన రావికంటి రామయ్య గారు 1936 జూన్ 17 న జన్మించారు. ఇతనికి కవిరత్న, వరకవి మరియు మంత్రకూట వేమన అని బిరుదులు ఉన్నాయి.అనేక సామాజిక రుగ్మ‌తుల‌పై అక్ష‌రాల్ని ఆయుధంగా చేసుకొని ప్ర‌జ‌ల్లో చైత‌న్యం నింపారు. ”మంత్ర‌కూట వేమ‌న‌”గా ప్ర‌సిద్ధికెక్కిన శ్రీ రావికంటి రామ‌య్య గుప్త ”విశ్వ‌దాభిరామ వినుర‌వేమ” అన్న రీతిలో ”క‌ల్ల కాదు రావికంటి మాట” అనే మాట మంథ‌ని ప్రాంతంలో ప్ర‌తీ ఒక్క‌రికి ప‌రిచ‌యం చేశారు. ”న‌గ్న‌స‌త్యాలు” శ‌తకంతో అనేక సామాజిక రుగ్మ‌త‌ల దారుణాల‌ను ఎండ‌గ‌ట్టారు. గౌత‌మేశ్వ‌ర శ‌త‌కం, గీతామృతం, వ‌ర‌ద గోదారి వంటి ర‌చ‌న‌లు చేసి ఎంతో మంది అభిమానుల‌ను సంపాదించుకున్నారు. తెలంగాణ పాఠ్య పుస్త‌కంలో శ్రీ రావికంటి రామ‌య్య గుప్తగారి ”న‌గ్నస‌త్యాలు” శ‌త‌కానికి ఇటీవ‌ల చోటు క‌ల్పించారు. ఇప్ప‌టికే కొంత‌ ఆల‌స్యం జ‌రిగిన‌ప్ప‌టికీ ఒక ప్ర‌జా క‌వికి స‌రైన గుర్తింపు ద‌క్కినందుకు సంతోషంగా ఉంది. శ్రీ రావికంటి రామ‌య్య గుప్త గారి లాంటి ప్ర‌జా క‌వుల సాహిత్య సారాంశం ప్రాంతాల‌కు అతీతంగా ప్ర‌తీ ఒక్క‌రికి అందించాల్సిన బాధ్య‌త ప్ర‌భుత్వాల మీద ఉంది. ఈ సంద‌ర్భంగా శ్రీ రావికంటి రామ‌య్య గుప్త గారు రాసిన న‌గ్న స‌త్యాలు శ‌త‌కంలోని జీవ‌న సారం మీరే చూడండి.

కులములన్ని ఒక్కకుదురు నుండె పుట్టె
పనుల బట్టి కులము పంచబడెను
అయిన కులము పేర అక్రమాలేలరా
కల్లగాదు రావికంటి మాట

హిందు క్రైస్తవీయు,ఇస్లాము మతములు
గతులు వేరుగాని గమ్యమొకటే
వేరు వేరు నదులు చేరవా సంద్రము
కల్లగాదు రావికంటి మాట

తండ్రి మాట వినెడి తనయు లెందరునేడు
గురువు మాట వినెడి కుర్రయేడి
తల్లిదండ్రి గురుల దల్చువారేలేరు
కల్లగాదు రావికంటి మాట
శ్రీ రావికంటి రామయ్య గుప్త

పాట్య పుస్తకాలలో తొలి సారి మంథని (మంత్రపురి ) కి ప్రాధాన్యం లభించింది .మన మంథని లో పుట్టి పెరిగిన రావికంటి రామయ్యగుప్త గారు రాసిన శతకాన్ని 7వ తరగతి తెలుగులో 3 వ పాఠం లో పొందు పరిచారు .ఆయన జీవిత విశేషాలు పొందుపరిచారు .వేమనకు సమకాలియుడైన రామయ్య గారి శతకానికి గుర్తింపు లభించడం తో పలువురు ఆనందం వ్యక్తం చేశారు .