Ramagiri Khilla

0

రామగిరి ఖిల్లా  చరిత్ర

ప్రాచీన కళా వైభవానికి కాకతీయుల నాటి కళా సంపదకు తార్కాణంగా చెప్పవచ్చు మన రామగిరి ఖిల్లా . ఒకటవ శతాబ్దం లో రామగిరి కోటను నిర్మించారు .రామగిరి ఖిల్లా కి శ 1442 నుండి కి శ 1557 వరకు బహుమనీ  సుల్తాన్ ,కి శ 1595 వరకు మొగళులు ,కి శ 1606 వరకు గోల్కొండ నవాబు ల ఆధీనం లో ఉన్నట్లు చరిత్ర పరంగా తెలుస్తుంది .కోట ఫై గౌతమి పుత్ర శాతకర్ణి,పులమావి ,బిందు పౌరిడి నిర్మాణాలను బట్టి అశోకుడు ,చాళుక్యులు ,రెడ్డి రాజులు,కాకతీయులు ,నిజాం ప్రభువుల వరకు పాలించినట్లు తెలుస్తోంది .వీటికి సంభందించిన ఆధారాలు పెద్దబొంకూరు ,గుంజపడుగు గ్రామాలలో పురావస్తు తవ్వకాలలో బయట పడ్డాయి .

అద్బుత కట్టడాలకు  నిలయం

రామగిరి కోటకు ఇరువైపుల ఇప్పటికి 9 ఫిరంగి లు ,40 తోపులతో పర్యాటకులను కనువిందు చేస్తునాయి .
శ్రీ రాముని వనవాసం సమయం లో ఇక్కడికి వచ్చి తపస్సు చేసి ఇక్కడ శివలింగం ప్రతిష్టించినట్లు పురాణాలు చెబుతునాయి.ఈ కోట పైన శ్రీ రాములు ,సిత ,హనుమాన్ విగ్రహాలతో పాటు నంది విగ్రహం కూడా ఉంది .ప్రకృతీ సౌందర్యం ,ప్రాచీన శిల్పకళా , మన సంస్కృతికి జీవం పోసిన కట్టడాలు  రామగిరి ఖిల్లా కు సొంతం .అశ్వాల కోట ,ఏడూ ద్వారాలు ,పసరు భావి ,సీతమ్మ కొలనుకుంట ,ముస్లిం ప్రభువుల స్మారక స్తూపాలు,ఇతర రాతి కట్టడాలు రామగిరి ఖిల్లా కు సొంతం .ఇక్కడి పకృతి రమణీయ దృశ్యాలు సందర్శకులను ఎంతోగాను కనువిందు చేస్తునాయి .

వన మూలికలకు నిలయం

అత్యంత విలువైన వన మూలికలు కోసం సుదూర ప్రాంతాల నుండి ఆయుర్వేద వైద్యులు ఖిల్లా ఫై వన మూలికలు సేకరించటం తో పాటు ,బొటనికల్ టూర్ ఫై వైద్య విద్యార్తులు రామగిరి ఖిల్ల ను సందర్శిస్తుంటారు .
శ్రావణ మాసం లో సందడి
ప్రతి సంవత్సరం శ్రావణ మాసం లో శని ,సోమ వారాల్లో  పర్యాటకులు ఖీల్లాను సందర్శిస్తారు .తెలంగాణా ,ఆంధ్రప్రదేశ్ తో పాటు మహారాష్ట్ర ,కర్ణాటక రాష్టాల నుంచి పర్యాటకులు వస్తుంటారు .

రామగిరి ఖిల్లా కు వెళ్ళాలంటే

కరీంనగర్ జిల్లా కేంద్రానికి తూర్పు దిశగా  మంథని వెళ్ళే రహదారి లో కమాన్ పూర్ మండలం లోని నాగేపల్లి (బేగం పేట క్రాస్ రోడ్)కలదు .అక్కడి నుండి 6 కిలో మీటర్ల దూరం లో బేగం పేట గ్రామానికి వెళితే రామగిరి ఖీల్లాను చేరు కోవచ్చు .రామగిరి ఖీల్లాను మొత్తం చూడాలంటే కనీసం 16 కిలోమీటర్లు కొండ పైన నడవ వలసి ఉంటది .ఖీల్లకు వీదేశీ యాత్రికులు కూడా అప్పుడపుడు వస్తుంటారు దీనిని మరికొంత అభివృద్ధి చేసుకుంటే మన మంథని చరిత్ర  ప్రపంచ వ్యప్తముగా తెలుస్తుంది.

Ramagiri Fort or “Ramgiri Khilla”, in Karimnagar District of Telangana, is a picturesque hilltop fort. It gives a great view of the merging of the rivers Maner and the Godavari and has an abundance of ayurvedic herbs and a large variety of flora and fauna.

Ramagiri is a stone-built fort with many bastions spread across a huge area of its hill. It is also known as Aaram-Giri (meaning Hill of rest/leisure) because of the thick greenery and the beautiful view that so pleases the human mind and eye.

The recent historical structures which are still present and whose authenticity can be verified are: Ruined walls, buildings, bastions, mosques, tombs.

Prataparudruni Kota: Horse stable, elephant shed, prison, a huge dining hall, another enormous hall, secret passages, narrow paths, guns, cannons, cannonballs.

The ruins of Chitrakota: Tratikota, Nimmakota, Nagara khana, and ammunition rooms.

There are many wells here, built by successive rulers at different times. Some of them, with their current names are: Topubavi, Nallakayyabavi, Pasarubavi, Haribavi, Achchammabavi and Ammagaribavi.

The Seven gateways, Chowkis and temples;

This area attracts tourists who come to see the fort, and also some Ayurvedic doctors and botany students who come to collect the different types of herbs and plants available. It is also a popular picnic spot. However, it is not advisable to go around after dark because at night it becomes very popular with reptiles, too.

There are many important sites around the hill fort including spots related to mythology and others to historical figures

You are able to post comments by logging in through facebook.

comments

Share.

Comments are closed.