చేపల పెంపకంతో మత్స్యకారులకు ఉపాధి -సర్పంచ్‌ పుట్ట శైలజ

0

గ్రామాల్లోని చెరువుల్లో చేపల పెంపకం ద్వారా మత్య్సకారులకు ఉపాధి లభిస్తుందని మంథని సర్పంచ్‌ పుట్ట శైలజ, ఎంపీపీ ఏగోళపు కమల అన్నారు. శనివారం మంథని మండలం పుట్టపాక గ్రామంలోని బ్రాహ్మణ చెరువులో 15వేల చేపపిల్లలను వదిలారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం అన్నివర్గాల ప్రజలకు ఉపాధి కల్పించే దిశగా అడుగులు ముందుకు వేస్తోందన్నారు. ఆయాగ్రామాల్లో గత పాలకుల నిర్లక్ష్యం మూలంగా నిర్వీర్యం అయిన చెరువులను మిషన్‌కాకతీయ ద్వారా ఆధునీకరణ చేపట్టి పూర్వవైభవానికి తీసుకువచ్చాయని పేర్కొన్నారు.

ప్రతిచెరువులో రెండు పంటలకు సరిపడా నీరు వచ్చి చేరిందని, రైతులు ప్రతినీటి బొట్టును వృధా చేయకుండా రెండో పంట వరకు కాపాడుకోవాలని సూచించారు. అలాగే ఈ చెరువులో ప్రభుత్వం ఉచితంగా చేపపిల్లలను సరఫరా చేసి వాటి ద్వారా మత్య్సకారులకు జీవనోపాధి చూపిస్తోందని చెప్పారు. ప్రతి గ్రామంలోని చెరువులో ఉచితంగా చేపపిల్లలను సరఫరా చేయడం జరుగుతోందని, రాబోయే కాలంలో మరిన్ని సౌకర్యాలు కల్పనకు కృషి చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్‌ ఐలి శ్రీనివాస్‌, మత్య్సశాఖ పీల్డ్‌ ఆఫీసర్‌ సురేష్‌, నాయకులు ఏగోళపు శంకర్‌గౌడ్‌, తగరం శంకర్‌లాల్‌, వీరారెడ్డి,పెగడ శ్రీనివాస్‌తో పాటు మత్య్సకారులు పాల్గొన్నారు.

You are able to post comments by logging in through facebook.

comments

Share.

Comments are closed.