పంపుహౌజ్‌ పనులను ప్రారంభించిన పుట్ట మధు

0

మేడిగడ్డ ప్రాజెక్టులో భాగంగా మండలంలోని కన్నపల్లి వద్ద చపేట్టిన పంపుహౌజ్‌ పనులను మంథని ఎమ్మెల్యే పుట్ట మధు సోమవారం ప్రారంభించారు. భూములు అందించిన రైతులచే కొబ్బరి కాయ కొట్టించి పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మేడిగడ్డ ప్రాజెక్టుకు కన్నపల్లి రైతులు ఆదర్శంగా నిలుస్తారన్నారు. ఇక్కడి ప్రజలు, ఈ ఊరి పేరు చిరస్థాయిగా నిలిచిపోనుందన్నారు. రైతులు తమ సమస్యలు, ఆవేదనను ఎమ్మెల్యేకు వ్యక్తం చేయగా రైతులకు అండగా ఉంటూ ప్రభుత్వ నిబంధనలు పక్కనబెట్టయినా సరే న్యాయం చేసేందుకు ముందుంటానన్నారు. రైతులు తమ భూములను త్యాగం చేసిన వారి రుణం ఎప్పటికి తీర్చుకోలేనిదని, మంత్రి కూడా హామీ ఇచ్చారని, తమ నియోజకవర్గంలో ఇచ్చేదానికంటే లక్షా 50వేలను ఎక్కువగా చెల్లిస్తామన్నారు. ఈ ప్రాంతాన్ని సస్య శ్యామలం చేస్తామన్నారు.ఈ కార్యక్రమంలో ప్రాజెక్టు సీఈ వెంకటేశ్వర్లు, ఈఈ ఓంకార్‌సింగ్‌, డీఈలు సూర్యప్రకాశ్‌, ప్రకాశ్‌, సర్పంచ్‌ లోకుల పోషక్క, ఏఎంసీ చైర్మన్‌ శ్రీనివాసరావు, నాయకులు మోహన్‌రెడ్డి, మెగా కన్‌స్ట్రక్షన్స్‌ జీఎం సతీష్‌కుమార్‌తోపాటు పలువురు పాల్గొన్నారు.

You are able to post comments by logging in through facebook.

comments

Share.

Comments are closed.