పేపర్ బ్యాగుల దిశగా మంథని గ్రామపంచాయతీ

0

మంథని గ్రామపంచాయతీని ఒక మోడల్ గ్రామపంచాయతీ (ఆదర్శ గ్రామపంచాయతీ) గా మార్చేందుకు సర్పంచ్ పుట్ట శైలజ గారు కృషి చేస్తున్నారు.మంథనిలో పాలిథిన్ కవర్ల వలన భూసారం తగ్గి భూమిలో పంటలు పండకుండా పోతున్నాయని గ్రహించి వెంటనే  పాలిథిన్ కవర్ల నిషేధాన్ని అమలు జేశారు.కానీ ఇది కొన్ని రోజులు మాత్రమే అమలు అయింది.అయితే ఈ మధ్య  ఎమ్మెల్యే పుట్ట మధుకర్ గారు కరీంనగర్ లోని గాంధీ చేతి కాగిత పరిశ్రమ నిర్వాహకులు జోగినపల్లి రఘు నందన్ గారిని కలసి పేపర్ బ్యాగ్ ల తయారీ మరియు నిర్వహణ గురించి తెలుసుకొని,మంథని గ్రామపంచాయతీ పరిధిలో స్థానిక గ్రౌండ్ దగ్గర పుట్ట లింగమ్మ ట్రస్ట్ ఆధ్వర్యంలో పేపర్ బ్యాగు ల శిక్షణ కేంద్రాన్ని నెలకొల్పారు.దీని ద్వారా స్థానిక మహిళలకు ఉపాధి మరియు ప్లాస్టిక్ బ్యాగ్ ల నిషేధం అమలవుతుందని తెలిపారు.కొత్త సంవత్సరం నుండి అందరూ పేపర్ బ్యాగ్ లు వాడాలని ఇది ప్రజల సహకారంతోనే సాధ్యమవుతుందని తెలిపారు. 

You are able to post comments by logging in through facebook.

comments

Share.

About Author

Comments are closed.