సిద్ధి, బుద్ధిలతో పెంజేరుకట్ట గణపతి

0

మంథనిలో మొట్ట మొదటి గణపతి ఉత్సవాలు జరిగి నేటికీ 100 సంవత్సరాలు అయింది.కరీంనగర్ జిల్లా లోని మంథని ప్రాంతానికి ఎంతో చరిత్ర ఉన్నది.ఇక్కడి వారు భారత స్వాతంత్ర్య సంగ్రామంలో కూడా పాల్గొని దేశం కోసం తమ ప్రాణాలు విడిచారు.దేశ భక్తిని గాక ఆధ్యాత్మిక భక్తి కూడా ఇక్కడి ప్రజల్లో ఉంటుంది.కాశి పట్టణం తరవాత ప్రతి ఒక్కరు మంథనిలోని దేవాలయాలను దర్శిస్తారు. ఇక్కడి  శివాలయాలకు చాల ప్రాముఖ్యత ఉంది.నవరాత్రుల విషయానికి వస్తే బ్రిటిషర్ల నిరంకుశత్వ పాలనకు వ్యతిరేకంగా ప్రజలను ఏకతాటిపైకి తెచ్చేందుకు బాలగంగాధర తిలక్‌ గణపతి నవరాత్రి ఉత్సవాలకు బీజం వేశారు! నాటి స్వాతంత్ర్యేచ్ఛకు చిహ్నంగా నిలిచిన కరీంనగర్‌ జిల్లా మంథనిలో కొలువుదీరిన గణపతికి నేటితో వందేళ్లు నిండుతున్నాయి. తిలక్‌ ప్రారంభించిన గణేశ్‌ ఉత్సవాల స్ఫూర్తిగా 1916లో… మంథని ప్రాంత స్వాతంత్య్ర సమరయోధులు సువర్ణ రఘురామయ్య, మార్పాక శేషయ్య, మంథని లింగన్న, లోకే పెద్దరామన్న అక్కడ సర్వజన గజానన మండలిని ఏర్పాటు చేసి వినాయక నవరాత్రోత్సవాలను ప్రారంభించారు. గణపతి ఉత్సావాల పేరిట కొందరు స్వాతంత్య్ర సమరయోధులు ప్రజల్లో చైతన్యాన్ని నింపి, బ్రిటిషర్లకు వ్యతిరేకంగా పోరాట స్ఫూర్తిని రగిలించారు. మహారాష్ట్రలోని నాగపూర్‌ నుంచి మట్టి విగ్రహాన్ని రహస్యంగా తీసుకొచ్చారు. ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించి అక్కడికి వచ్చే ప్రజలకు స్వాతంత్య్ర ఉద్యమం గురించి అవగాహన కల్పించారు. నాగపూర్‌, మంథనిలో మినహా దేశంలో మరెక్కడ సిద్ధి, బుద్ధి(భార్యలు) విగ్రహాలతో గణేశ్‌ దర్శనం లభించదు.

You are able to post comments by logging in through facebook.

comments

Share.

Comments are closed.