Nadi Veedhi Ganesh 2015

0

సార్వజనిక గజాణన మండలి,నడివీధి,మంథని

నడివీధి గజానన మండలికి వంద సంవత్సరాల గొప్ప చరిత్ర వుంది. మనకు స్వాతంత్ర్యం రాక మునుపే ఈ గణపతి నవరాత్రులు మన వద్ద జరిగేవి. రజాకార్లను ఎదుర్కునేందుకు మనవాళ్ళు గణపతి నవరాతృల్లో వ్యూహరచన చేసేవారని పెద్దలు చెప్పేవాళ్ళు. ఐతే మన పక్క రాష్ట్రమైన మహారాష్ట్ర నుండి మనకు వచ్చిన ,మన పెద్దలు తెచ్చిన వారసత్వ ఆధ్యాత్మిక సంపద ఇదే.

ఈ గణపతి నవరాతృలకు మన జీవితాలకు ఎంతో గట్టి బంధం ఉంది.మన జీవితంలో కొన్ని మధుర స్మృతులు ఈ నవరాతృలతో ముడివేసుకున్నాయి.ప్రతీ యేటా ఈ నవరాతృలను మన జీవితంలో ఒక భాగంగా, భాధ్యతగా భావిస్తాము.

2018 లో నూరు వసంతాలు పూర్తి చేసుకుంటున్న మన నడివీధి గజాణన మండలి గూర్చి తెలుసుకుందామా !

పూర్వము 1918 వ సంవత్సరంలో కరిణె రాధాకిష్టయ్య గారి ఆధ్వర్యాన వారి స్వగృహంలో ప్రారంభమైన ఈ గణపతి నవరాతృలు కరిణె సీతయ్య, గంగా రాయన్న , ముద్దు రాయన్న ,ఏనుక గట్టయ్య ,గట్టు దక్షిణామూర్తి,పనకంటి నర్సయ్య,సోమయాజుల కిష్టయ్య,పల్లి బుచ్చయ్య,దహగం గణపతి,రామడుగు రాయన్న,గులుకోట సీతయ్య,చొప్పకట్ల పుల్లయ్య,రాంపల్లి హరిదాసు, దూలం గణపతి సిద్ధాంతి, మార్పాక రాజన్న, మార్పాక నాగన్నమరియు మిత్ర బృందంతో ప్రారంభం ఐన ఈ గణపతి సంస్థ ,దాదాపుగా 30 సంవత్సరాలు వీరి ఆధీనంలో నడిచింది . ఆ సమయంలో నడివీధి గణపతి సంస్థకు స్వంత భవంతి లేదు.ఐతే దాదాపుగా రెండు దశాబ్ధాలు కరిణె రాధాకిష్టయ్య గారి ఇంట్లోనే నెలకొలిపేవారు.కరిణె రాధాకిష్టయ్య గారికి స్వయంగా భజనలు అంటే ఉత్సాహం ఉన్న కారణంగా చక్రీయ భజనలు,ఏకాహం భజనలు చాల మనోరంజకంగా ,వీనులవిందుగా,భక్తి పారవశ్యంగా మరియు ఆహ్లాదంగా నిర్వహించేవారు.ఐతే మంథనిలోని అన్ని వీధుల వారు ఈ భజనా కార్యక్రమంలో పాల్గొనేవారు. ఆ సమయం నుండి నడివీధి భజనపరులకు ప్రత్యేక గుర్తింపు ఉండేది.

కీ .శే . శ్రీ కరిణె రాధాకిష్టయ్య గారు నడివీధి గజానన మండలి వ్యవస్థాపకులు.మంచి ఉదార స్వభావం కలిగిన ,నాయకత్వ లక్షణాలు కలిగిన భజనాపరుడు .పరమ భక్తుడు.పూజ్యనీయుడు.

శ్రీ కరిణే రాధాకిష్టయ్య గారి తదనంతరం (1960-1975) మధ్య గంగా రాయన్న ,ముద్దురాయన్న,ఏనుక గట్టయ్య ఆధ్వర్యంలో “ పిల్లి రాధమ్మ” అను అనాధ ఐన ఒక పుణ్యాత్మురాలు గారి ఇల్లును అమె తదనంతరం నడివీధి గణపతి సంస్థకు ధారాదత్తం చేయడం జరిగింది.

వీరి తదనంతరం (1975-1990) మధ్య శ్రీ పనకంటి నర్సయ్య, సోమయాజుల కిష్టయ్య ,రాంపల్లి మహదేవ్, కరిణె హరి,రాంపల్లి చంద్రమౌళి,అష్టధని గంగాధర్ ,కొత్తపల్లి దత్తయ్య,మార్పాక సుదర్శన్,రామడుగు ఫ్రభాకర్,దహగం వసంతం, చిల్లప్పగారి రాజన్న ,కాచెగారి శేఖర్ ,నల్లగొండ అంతయ్య,కుందారం విస్సయ్య ,గంగా రాధాకిషన్,మార్పాక ప్రహ్లాద్,నల్లగొండ శ్రీనివాస్,యెలిసెట్టి అమర్ నాథ్ మరియు తదితర్ల హయాంలో నడిచింది.1978 వ సంవత్సరంలో షష్టి పూర్తి (వజ్రోత్సవాలు) ఘనంగా నిర్వహించారు. ఆ మట్టి మరియు గూన పెంకల ఇల్లు ను ,బెంగుళూరు పెంకలు మరియు పాకశాల కు రేకుల షెడ్ గా నిర్మాణం జరిగింది ఆ 1978 సంవత్సరంలోనే.

కీ .శే . శ్రీ పనకంటి నర్సయ్య గారు నడివీధి గజాణన మండలికి దాదాపుగా 30 సంవత్సరాలు ఉచితంగా పూజలు చేయడం ,ఆయన గారి నిస్వార్ఠమైన ,అంకిత భావానికి మరియు నడివీధి పట్ల తనకున్న అభిమానానికి ఒక ప్రతీక. ప్రస్తుత కాలంలో అటువంటి మహనీయులు ,నిస్వార్థ పరులు కానరారు.                ఆయన గారి తదనంతరం డబ్బులు చెల్లించి పూజలు చేయించుకునే విధానం మొదలయ్యింది.అది ఇప్పటికీ కొనసాగుతూ ఉంది.

(1990-2006) మధ్యలో కొత్తపల్లి హరిశ్,దూలం రమేశ్,మార్పాక మహెందర్, కాచే కిరణ్,కరిణె బ్రదర్స్ శ్రీకాంత్& శ్రీధర్,రాంపల్లి బ్రదర్స్ రాజు & శ్రీను ,రామడుగు బ్రదర్స్ శ్రీనివాస్ & వేణుగోపాల్ , కరిణె ప్రవీణ్ కుమార్ & బ్రదర్స్ ,మార్పాక బ్రదర్స్, భాగవతుల బ్రదర్స్ ,వరహాల బ్రదర్స్ రాజు , రవి & సురేందర్ ,దహగం రమేశ్,కుందారం మారుతి, అవధానుల బ్రదర్స్ ,ఆష్టధని బ్రదర్స్ ,ముద్దు బ్రదర్స్ ,కాచే బ్రదర్స్ ఇలా ఎంతో మంది యువత ఈ గణపతి నవరాత్రి   ఉత్సవాలను నిర్వహించారు.

ఐతే శిథిలావస్థకు చేరిన గణపతి భవనం గూర్చి కొత్తపల్లి హరిశ్,మార్పాక సుదర్శన్, భాగవతుల శంకర్, రామడుగు వేణుగోపాల్,వరహాల సురెందర్,అష్టధని గంగాధర్ , గంగా రాధాకిషన్ గార్లు వీధి సభ్యులతో అత్యవసర సమావేషమును ఏర్పాటు చేసి 2009 లో నూతన భవన నిర్మాణం చేపట్టడం జర్గింది.ఐతే వీధి సభ్యులందరు ఉదారంగా సహకరించి భవణ నిర్మాణానికి సహాయపడ్డారు.

అదే సమయంలో దుబాయ్ నుండి స్వదేశానికి ఉధ్యోగ రీత్యా తిరిగి వచ్చిన కొత్తపల్లి హరిశ్ గారు మరియు మార్పాక సుదర్సన్ గారు (విశ్రాంత NRI)ప్రత్యేక శ్రధ్ధ తీసుకోని ఆర్థికంగా పెద్దమొత్తంలో సహాయం చేయడం గర్హనీయం.

ప్రస్తుత సువిశాల భవంతి ప్రతి యేటా జరిగే గణపతి నవరాతృలకే కాకుండా ,నడివీధి సభ్యులకు మరియు మంథని ప్రజల ఫంక్షన్లకు ,విందులకు,పూజలకు,పెళ్ళీళ్ళకు,బారసాలలకు ,తీర్థవిధులకు అందుబాటులో ఉన్న వేదికగా మారింది.వివిధ రకాల వంటపాత్రలు మరియు భవనపు అద్దెకు నామ మాత్ర చార్జీలు వసూలు చేస్తున్నారు కమిటి వారు. నడివీధి గజానన సంస్థ అందరికీ అందుబాటులో ఉన్న కారణంగా నిత్యం ఫంక్షన్లతో కళ కళ లాడుతూవుంటుంది. ఈ భవంతి సౌకర్యాలను చూసి పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పుడు ఎక్కువ మంది వీధి యువత క్రమక్రమంగా చదువు,ఉధ్యోగ రీత్యా దేశ విదేశాలకు వలసలకు,ప్రవాసాలకు వెళ్ళడంతో ,ప్రాంతీయంగా ఉద్యోగం చేస్తున్న భాగవతుల శంకర్ గారు,వరహాల సురేందెర్ గారు ,కాచే కిరణ్ గారు,అవధానుల లక్ష్మినారాయణ గారు తదితరుల సహకారంతో, విశ్రాంత జీవనం సాగిస్తున్న శ్రీ అష్టధని గంగాధర్ గారు,రామడుగు ప్రభాకర్ గారు, రాంపల్లి చంద్రమౌళి గారు,దహగం మధు గారు,మార్పాక సుదర్శన్ గారు,మార్పాక నర్సింగరావు గారు,చొప్పకట్ల శంకర్ గారు తదితరులు   పూజలు,భజనలు మరియు విందులు చాలా బ్రహ్మాండంగా నిర్వహిస్తున్నారు.

ఈ సుధీర్ఘ గణపతి నవరాతృల ప్రస్థానంలో నడివీధి గజానన మండలి వంద వసంతాలు పూర్తి చేసుకుంటున్న సంధర్భంగా 2018 లో వజ్రోత్సవాలు నిర్వహించాలని నిర్ణయించారు.ఐతే దేశ విదేశాల్లో స్థిరపడ్డ నడివీధి ,మంథని వాస్తవ్యులు ఈ వజ్రోత్సవాల్లో పాల్గొని విజయవంతం చేసి ఆ గణనాథుడి అనుగ్రహానికి పాతృలు కావాలని ఆశిస్తున్నాము.

ఎందరో మహానుభావులు.అందరికి నా వందనాలు.కథనాలు,కవితలు రాయడం నా హ్యాబి.ఈ “నడివీధి గజానన మండలి ”గూర్చి దాదాపుగా అందరిని వివరించే ప్రయత్నం చేసాను. పొరపాటునా ఎమైనా లోపిస్తే అన్యదా భావించరాదు.అదేవిధంగా మీ యొక్క అభిప్రాయములు తెలియజేస్తే సరిదిద్దుకుంటాం.సెలవు.

– రామడుగు వేణుగోపాల్

You are able to post comments by logging in through facebook.

comments

Share.

Comments are closed.