ముద్దు రామకృష్ణయ్య

0

ముద్దు రామకృష్ణయ్య కరీంనగర్ జిల్లా మంథనికి చెందిన విద్యావేత్త. 1907లో మంథనిలో జన్మించాడు.తండ్రి ముద్దు రాజన్న, తల్లి ముద్దు అమ్మాయి.1946లో బ్రిటన్లోని లీడ్స్ విశ్వవిద్యాలయం నుండి విద్యలో మాస్టర్స్ డిగ్రీ (ఎం.ఇడి.,) పొందాడు.1950 వ దశకంలో అనేక దేశాలు తిరిగాడు. ఆసియా,ఆస్ట్రేలియా, యూరప్, అమెరికా ఖండాలలోని పలుదేశాలు పర్యటించి, అక్కడి విద్యావిధానాలు అధ్యయనం చేశాడు. మన దేశపు విద్యారంగంలో అనేక సంస్కరణలు ప్రవేశపెట్టాడు. నేటికీ ఇతని విధానాలు కొన్ని అమలులో ఉన్నాయి.నిరక్షరాస్యతా నిర్మూలన కొరకు ‘ఈచ్ వన్ టీచ్ వన్ ‘ ఉద్యమాన్ని జీవిత పర్యంతం కొనసాగించిన గొప్ప విద్యావేత్త. తాను విదేశాలలో చదువుకొవడానికి వెళ్ళినప్పుడు ఎదురైన అనుభవాలతో నా ప్రథమ విదేశీ యాత్ర అను పుస్తకాన్ని వెలువరించాడు. ఇతను 1985 అక్టోబర్ 21 వ తేదిన మరణించాడు.

ముద్దు రామకృష్ణయ్య గారి సమయపాలన:
క్రమశిక్షణలో,సమయపాలనలో ముద్దు రామకృష్ణయ్య అగ్రేసరుడు.అయన జగిత్యాలలో ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్నప్పుడు పాఠశాలలో జాతీయ పర్వదినాన్ని పురష్కరించుకొని ఒక రాజకీయ నాయకున్ని పిలిచారు.ఉదయం 9 గంటలకు అతను రావాల్సిఉంది కానీ అయన సమయానికి రాలేదట సమయం కాగానే ముద్దు రామకృష్ణయ్య గారే జాతీయ పతాకాన్ని ఎగురవేశారు.అప్పుడు ఆ రాజకీయ నాయకుడు 10 నిమిషాలు లేటుగా వచ్చాడు.లేటుగా వచ్చినా సదరు నాయకునికి ముద్దు రామకృష్ణయ్య గారు మొహమాటం లేకుండా సమయ పాలనా గురించి చెప్పారు.తరవాత మళ్ళి కొంత కాలానికి జాతీయ పర్వదినం వచ్చింది.మళ్ళి అదే నాయకున్ని రామకృష్ణయ్య గారు పిలిచారు.అయితే ఈ సారి అరగంట ముందుగానే బడికి వచ్చేసరికి బడికి తాళం ఉంది.రామకృష్ణయ్య రాగానే బడికి అరగంట ముందే వచ్చాను బడి తెరవలేదు ఎందుకు అన్నాడు. రామకృష్ణయ్య గారు చెబుతూ..బడి 9 గంటలకు తెరుచుకుంటుంది.మీరు 8 గంటలకే వచ్చి కూర్చుంటే బడి తెరవరు అన్నారు.అది రామకృష్ణయ్య గారి సమయపాలనకు నిదర్శనం.ఏ ఒక్కరోజు కూడా లేటుగా వచ్చేవారు కాదు.సమయ పాలనకు మారుపేరు ముద్దు రామకృష్ణయ్య,   

ఇటీవలే ముద్దు రామకృష్ణయ్య గారి విగ్రహం సీతారామ సేవ సదన్ ఆధ్వర్యములో  మంత్రపురి దర్శన్ లో పెట్టి ఆయన చేసిన సేవలు మంథని ప్రజలు స్మరించుకున్నారు.లండన్ బీబీసీలో పనిచేసి తిరిగొచ్చి, ఎంతో మంది విదేశాలకు దారి చూపిన రామకృష్ణయ్య లాగా ప్రతి ఒక్కరు సాటి మనిషికి సహాయం చేయాలని మంథని ప్రజలు తమ మనోభావాలు పంచుకున్నారు.మంథని తమ్మిచెరువు కట్టలోని మంత్రపురి దర్శన్‌వద్ద ఏర్పాటు చేసిన ముద్దు రామకృష్ణయ్య విగ్రహాన్ని అప్పటి పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు ఆవిష్కరించారు. తర్వాత సభలో రామకృష్ణయ్య రచించిన ‘నా ప్రథమ విదేశీయాత్ర’ పుస్తకాన్ని ఎమ్మెల్సీ చుక్కారామయ్య, ‘రామకృష్ణ స్మృతి’ పుస్తకాన్ని ‘నమస్తే తెలంగాణ సీఎండీ సీఎల్ రాజం ఆవిష్కరించారు. ముద్దు రామకృష్ణయ్య రాత ప్రతుల డీవీడీని సాంస్కృతిక శాఖ డైరెక్టర్ డాక్టర్ రాళ్లబండి కవితవూపసాద్ ఆవిష్కరించారు.

You are able to post comments by logging in through facebook.

comments

Share.

Comments are closed.