మంథని మంత్రపురిగా మారాలి -స్వామి పరిపూర్ణానంద

0

మంథనిని మంత్రపురిగా మార్చేందుకు అన్ని వర్గాల ప్రజలు సహకరించాలన్నారు స్వామి పరిపూర్ణానంద. పెద్దపల్లి జిల్లా మంథని శ్రీ నృసింహ శివకిరణ్ గార్డెన్స్ లో భగవద్గీత పురుషోత్తమ ప్రాప్తి యోగంపై స్వామీజీ ప్రవచనాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వచ్చిన 8 లక్షల రూపాయల పారితోషకాన్ని కొత్తగా నిర్మించబోయే వేద పాఠశాల కోసం తనవంతుగా అందించారు స్వామి పరిపూర్ణానంద. వేద పాఠశాల అభివృద్ధికి రాజకీయాలు, కులాలు, వర్ణాలు, వర్గాలు, ప్రాంతాలు, రాగద్వేషాలకు అతీతంగా అందరూ సహకరించాలని కోరారు స్వామీజీ. ఇక మంథనిని మంత్రపురిగా మర్చేందుకు స్వామి పరిపూర్ణానంద చేస్తున్న కృషి మరువలేనిదని బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి అన్నారు. వైదిక విశ్వ విద్యాలయం ఇక్కడ స్థాపించబడాలని.. అప్పుడే మంత్రపురి పేరుకు సార్ధకం వస్తుందన్నారాయన.

You are able to post comments by logging in through facebook.

comments

Share.

About Author

Comments are closed.