మంథనిలో తెరాస కు షాక్

0

మంథని మేజర్‌ గ్రామ పంచాయతీ ఉపసర్పంచ్‌గా పుప్పాల భాగ్యలక్ష్మీ (కాంగ్రెస్)ఎన్నికయ్యారు. పంచాయతీ కార్యాలయంలో సోమ వారం జరిగిన ఎన్నికల్లో రెండు ఓట్ల తేడాతో సీపతి బానయ్యపై భాగ్యలక్ష్మీ గెలుపొందారు. రానున్న 2019 ఎన్నికలల్లో కూడా మంథని నియోజక వర్గంలో కాంగ్రెస్ (దుద్ద్దిళ్ళ శ్రీధర్ బాబు)గెలవడం ఖాయమని వార్డ్ సభ్యులు తెలిపారు.రానున్న ఎన్నికలకు ఇది సూచన అని తెలిపారు. ఉపసర్పంచ్‌గా గెలుపొందిన భాగ్యలక్ష్మీని ఎన్నికల అధికారి అనుదీప్‌తో పాటు పలువురు నాయకులు అభినందించారు. ఎన్నిక అనంతరం పట్టణంలో భారీ ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీలో కాంగ్రెస్‌ నాయకులు కొత్త శ్రీనివాస్‌, అజీంఖాన్‌, శశిభూషన్‌ కాచే, బండ కిషోర్‌రెడ్డి పాల్గొన్నారు.

You are able to post comments by logging in through facebook.

comments

Share.

Comments are closed.