సామాజిక సేవలో మంథని పీపుల్ గ్రూప్

0

మంథని అభివృద్ధిలో ప్రభుత్వం తో పాటు ప్రజలు ముందుకు వస్తేనే అనుకున్న అభివృద్ధి సాధ్యమవుతుందని తమకు తోచినంత సహాయంచేస్తున్నారు ఇక్కడి ప్రజలు. ఇక్కడ పుట్టి పెరిగి వివిధ ప్రాంతాల్లో ఉద్యోగం చేస్తున్న మంథని వాసులు ఒక సమూహంగా ఏర్పడి మంథని అభివృద్ధిలో తమ వంతు పాత్ర పోషిస్తున్నారు.ప్రతి సంవత్సరం చెట్లు పెట్టడం మరియు అవి పెరిగేలా శ్రద్ద తీసుకోవటం,ప్రభుత్వ విద్యార్థులకు బ్యాగులు మరియు పరీక్షల సమయాల్లో వారికి ప్రయాణ ఛార్జిలు,పరీక్షా సామగ్రి,ఎండాకాలంలో మంథనిలో ట్యాంకుల ద్వారా నీటి సదుపాయం,ఆపదలో ఉన్న మంథని వాసులకు సహాయం అందించారు.అంతే కాకుండా ఈ మధ్య 20 సిమెంట్ బెంచీలు ప్రజలు సేద తీరేందుకు బ్యాంకుల వద్ద,దేవాలయాల వద్ద,పాఠశాలల్లో,హాస్పిటల్లో మరియు మంథని ప్రధాన రహదారుల వద్ద వేయించారు. మొదటిదశలో భాగంగా 20 బెంచీలు,దశల వారీగా 600 బెంచీలు సమకూర్చడానికి ప్రయత్నిస్తున్నారు ఈ సిమెంట్ బెంచీలు ప్రజలకు,పెద్ద వయస్సు వాళ్లకు చాల ఉపయోగపడుతున్నవి.ఈ విధంగా ప్రతి ఒక్కరు ముందుకు వస్తే మన మంథని అతి కొద్దీ రోజుల్లోనే అభివృద్ధి చెందుతుంది.

You are able to post comments by logging in through facebook.

comments

Share.

Comments are closed.