మంథని జేఎన్టీయూలో ఆందోళన ఉధృతం

0

సెంటినరీకాలనీ: కరీంనగర్ జిల్లా మంథని జేఎన్టీయూలో మూడు రోజులుగా చేస్తున్న మిషనరీ మైనింగ్ విద్యార్థుల ఆందోళన గురువారం తీవ్రమైంది. మిషనరీ మైనింగ్‌లో ఇంజినీరింగ్ కోర్సుకు గుర్తింపు కల్పించడంతోపాటు ఉద్యోగాల్లో అవకాశాలు కల్పించాలన్న డిమాండ్‌ను వర్సిటీ అధికారులు పట్టించుకోవడం లేదని బాయ్స్ హాస్టల్ భవనంపై ఉన్న ఓవర్ హెడ్‌ట్యాంక్‌పైకి ఆరుగురు విద్యార్థులు ఎక్కి నిరసన తెలిపారు. డిమాండ్లను ఆమోదించకుంటే దూకి ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు. వీరికి మద్దతుగా మిగతా బ్రాంచ్‌ల విద్యార్థులు ఆందోళనకు దిగి తరగతి గదుల్లో ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు.

పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీస్ బలగాలు కళాశాలలో మోహరించాయి. వర్సిటీ అధికారులతో ప్రిన్సిపాల్ మాట్లాడుతూ అధికారులిచ్చిన హామీలను విద్యార్థుల ఫోన్లకు మెసెజ్‌ల ద్వారా పంపినా వీసీ లిఖితపూర్వకంగా హామీ వస్తేనే దిగుతామని తేల్చిచెప్పారు. సింగరేణి రెస్యూటీం వచ్చి ట్యాంక్‌చుట్టూ పెద్ద వలలు కట్టింది. అంబులెన్స్, ఫైరింజన్ సిబ్బందిని అందుబాటులో ఉంచారు. దీంతో హైదరాబాద్‌లో జేఎన్‌టీయూలో వీసీ, రిజిస్ట్రార్ సమావేశమయ్యారు. సమస్యను కచ్చితంగా పరిష్కరిస్తామన్న హామీని ఇవ్వడంతో కిందికి దిగారు.

You are able to post comments by logging in through facebook.

comments

Share.

Comments are closed.