మంథని గ్రామపంచాయతీ వైఫల్యం

0

మంథని గోదావరికి వివిధ రాష్ట్రాల నుండి తరలి వస్తారు.అందులోను అతి ప్రవిత్రమైన కార్తీక మాసంలో ఇక్కడికి వచ్చే జనాభా అధికంగా ఉంటుంది.దీన్ని దృష్టిలో పెట్టుకొని పారిశుద్ధ్య చర్యలు చేపట్టాల్సిన పాలకవర్గం గాలికి వదిలేసింది.దేవి నవరాత్రుల తరవాత విగ్రహాలు నదిలోంచి తీసి ప్రక్కకు పెట్టాలి కానీ ఆలా చేయలేదు.ఎక్కడ పడితే అక్కడ వేశారు.గోదావరిలో దిగడానికి భక్తులు చాల ఇబ్బంది పడుతున్నారు.పదుల సంఖ్యలో విగ్రహాలు అడ్డంగా ఉన్నాయి.దానికి తోడు ఎక్కడి చెత్త అక్కడే.పుష్కరాలలకు వేసిన పైపులు పగిలి దారికి అడ్డంగా పది ఉన్నాయి.ఇకనైనా మంథని గ్రామ పంచాయతీ స్పందించి చెత్తను తొలగించి మంథని గోదావరి పవిత్రతను కాపాడాలని మంథని వాసులు కోరుకుంటున్నారు.

You are able to post comments by logging in through facebook.

comments

Share.

Comments are closed.