25 సంవత్సరాల కల మంథని జిల్లా

0

1992 – మంథని విద్యార్థి యువత “మంథని ని జిల్లా కేంద్రంగా గుర్తిం చాలని” నిరాహారదీక్షలు.
2016 – మరలా అదే పరిస్తితి పునరావృతం ?

మంథని వాసుల 25 సంవత్సరాల కళ “మంథని జిల్లా” జూన్ లో తీరున ?
పార్టీలకు, వర్గాలకు అతీతంగా మలి దశ పోరాటానికి మంథని నియోజకవర్గ ప్రజానీకమ్ సిద్దమవుతుందా ?
ఇప్పుడు కాకుంటే మరెప్పటికీ మంథని ” జిల్లా ” గా కాదు అంటున్న మేధావి వర్గం మాటలతో ప్రజలు ఏకీభవిస్తూ వినతిపత్రాలు అందిస్తున్నారు. చారిత్రిక మంథనికి జిల్లాకు ఉండవలసిన అన్ని అర్హతలు ఉన్నాయని మేధావులు వివరిస్తున్నారు.

అది అలా ఉండగా ఒక వర్గం ప్రజలు మంథని జిల్లా కేంద్రం కావడం వాళ్ళ, రాష్ట్ర రాజధానికి సైతం బస్సు సౌకార్యం మంథని నుండి ఉండటమే కాక రెండు ప్రధాన రైల్వేలకు సమీపంగా ఉండటంతోపాటు, జిల్లా నుండి రాష్ట్ర రాజదానికి దగ్గరగా ఉంటది అనే వాదన వినిపిస్తున్నారు . అంతే కాకుండా పవిత్ర గోదావరి పారుతున్న నేల , దేశానికి ప్రధాని ని అందించిన ప్రాంతంను జిల్లా చేయడం ద్వార తెలుగు ప్రజల ఖ్యాతిని దేశమంతా చాటిన పివికి స్మృతిగా,” పివి జిల్లా” అనే పేరుతో తెలంగాణ ప్రజల గౌరవంగా నిలుస్తుందని వినతిపత్రం ఇవ్వడానికి సిద్దమవుతున్నారు.

మరో వర్గం ప్రజలు మంథనిని జిల్లా చేయడం ద్వారా మాకు భద్రతా పరంగా విదులు నిర్వహించడానికి వీలుగ ఉండటమే కాక ప్రజలకు రాత్రి సమయాలలో అందుబాటులో ఉండగలమని గంటపథంగా చెపుతున్నారు. భూపాల్ పల్లిలో మంథనిని కలపడం పై గౌరవ ముఖ్య మంత్రి గారు మరొకమారు అద్యయనం చేయాలని కోరుతున్నారు.

మేధావులకు నిలయమైన మంత్రకూటం, మంథనిని జిల్లా చేయడం ద్వార పరిశ్రమలు, పెట్టుబడులు, వ్యాపార, ఉద్యోగావకాశాలు పెరుగుతాయని, మన ప్రాంత ప్రజలు మన వద్దే ఉండవచ్చని, చిన్న ఉద్యోగలకు సహితం పట్టణానికి వలస పోవాల్సిన అవసరం ఉండదని చెప్తున్నారు. ఇది ఇలా ఉండగా విద్య, వైద్య పరంగా మరియు ఆర్థికంగా ఈ ప్రాంతం అభివృద్ధి బాటలో ముందంజలో ఉండే అవకాశం లేకపోలేదని వాపోతున్నారు.

ఏది ఏమైనా జూన్ 2న మంథని జిల్లా గా నిలుస్తుంద ? మరొక జిల్లాకు వలస పోతుంద చూడాలి !

You are able to post comments by logging in through facebook.

comments

Share.

Comments are closed.