మన కోసం చారిటబుల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో క్రికెట్‌ టోర్నమెంట్‌

0

కమాన్‌పూర్‌ : మండల కేంద్రంలోని పోచమ్మకుంట మైదానంలో ‘మన కోసం’ చారిటబుల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో చాంపియన్‌షిప్‌ క్రికెట్‌ టోర్నమెంట్‌ నిర్వహించారు. ఈ టోర్నీలో విజేతలుగా నిలిచిన జట్లకు బుధవారం స్థానిక బస్టాండ్‌ ఆవరణలో సర్పంచ్‌ కొంతం సత్యనారాయణ చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. టోర్నీలో కమాన్‌పూర్‌కు చెందిన రజకరాయల్స్‌ జట్టు ప్రథమ స్థానంలో నిలవగా ఫ్రెండ్స్‌ యూత్‌ జట్టు ద్వితీయ స్థానంలో నిలిచాయి. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్‌ ఎండి.ఖలీమోద్దిన్‌, కో-ఆప్షన్‌ సభ్యులు, మన కోసం చారిటబుల్‌ ట్రస్ట్‌ అధ్యక్షుడు ఎండి.అబ్దుల్‌రఫిక్‌, ఉపాధ్యక్షులు పొన్నం శ్రీనివాస్‌గౌడ్‌, ఆటో యూనియన్‌ అధ్యక్షుడు జంగపల్లి లక్ష్మణ్‌, సభ్యులు శరత్‌, శ్రీనివాస్‌, ఎం.సందీప్‌, జంగపెల్లి రవి, జె.సతీష్‌, పెండ్యాల రాజు, సాయి, మహేష్‌ పాల్గొన్నారు.

You are able to post comments by logging in through facebook.

comments

Share.

Comments are closed.