మంథనిలో మహిళా సంఘం భవనఁ

0

మంథనిలో మహిళా సంఘం భవన నిర్మాణానికి మంగళవారం ఎమ్మెల్యే పుట్టమధు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. నిజామాబాద్‌ ఎంపీ కల్వకుంట్ల కవిత తన నిధుల నుంచి రూ.10లక్షలు భవన నిర్మాణానికి మంజురు జేశారు. మంథని అభివృద్ధిలో భాగస్వామ్యం అవుతున్న ఎంపీ కవితకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. దశల వారీగా ఈ భవనాన్ని పూర్తిచేస్తామన్నారు. ఆ తర్వాత సర్పంచ్‌ పుట్టశైలజ మాట్లడారు… ఎమ్మెల్యే మధు ప్రత్యేక చొరవతో ఎంపీ నిధులను మంజూరి చేశారన్నారు. ఎన్నో సంవత్సరాలుగా మహిళలకు ప్రత్యేక భవనం లేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈ భవనంలో అన్ని సౌకర్యాలు కల్పిస్తామన్నారు. బస్టాండ్‌కు సమీపంలో ఉండటంతో చుట్టుపక్కల గ్రామాల మహిళలకు కూడా ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఏగోళపు కమలశంకర్‌గౌడ్‌, వైస్‌ ఎంపీపీ వేల్పుల గట్టయ్య, ఎంపీటీసీలు, వార్డు సభ్యులు పాల్గొన్నారు.

You are able to post comments by logging in through facebook.

comments

Share.

Comments are closed.