అమ్మవారికి 60లక్షల బంగారు కిరీటం

0

మహదేవపూర్ మండలం కాళేశ్వరంలో కొలువై ఉన్న కాళేశ్వర ముక్తీశ్వర స్వామికి తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు దంపతులు భారీ కానుక అందజేశారు. సతీసమేతంగా ఆదివారం కరీంనగర్ జిల్లా పర్యటనకు వచ్చిన కేసీఆర్.. సోమవారం ఉదయమే జిల్లాలోని మహదేవ్ పూర్ మండలంలోని కాళేశ్వర స్వామి ఆలయానికి చేరుకుని స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. కేసీఆర్‌ దంపతులకు పూర్ణకుంభంతో వేదపండితులు స్వాగతం పలికారు. అనంతరం కేసీఆర్ దంపతులు రూ.60 లక్షలతో చేయించిన బంగారు కిరీటాన్ని శుభానందాదేవికి సమర్పించారు.

తెలంగాణ రాష్ట్రం సిద్ధిస్తే కిలోన్నర బంగారంతో కాళేశ్వరం సన్నిధిలోని శుభానందా దేవికి స్వర్ణ కిరీటాన్ని సమర్పిస్తానని 2012లో మొక్కిన కేసీఆర్.. స్వరాష్ట్రం సిద్ధించిన తర్వాత కాళేశ్వర క్షేత్రానికి నేడు వచ్చిన సందర్భంగా ఆ మొక్కును చెల్లించుకున్నారు. ఆ తర్వాత కన్నెపల్లి వద్ద కాళేశ్వర ప్రాజెక్టులో భాగంగా పంప్ హౌజ్‌కు భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో శాసనసభాపతి మధుసూదనాచారి, ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మంత్రులు హరీశ్‌రావు, ఈటల రాజేందర్‌, పోచారం శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం కేసీఆర్‌ కాళేశ్వరం వచ్చి అక్కడి నుంచి అంబటిపల్లికి చేరుకుంటారు. అక్కడ మేడిగడ్డ బ్యారేజికి శంకుస్థాపన చేయనున్నారు.

 

You are able to post comments by logging in through facebook.

comments

Share.

About Author

Comments are closed.