దేశ విదేశాల్లో సత్తా చాటుతున్న మంథని కుర్రాడు

0

రాజవరం రాజా రుత్విక్ కాంపిటీటివ్ చెస్ (చదరంగము ఆట) ఆడుతూ మంథని కీర్తి ప్రతిష్టలు దేశ విదేశాల్లో చాటుతున్నాడు . రుథ్విక్ దేశ విదేశాల్లో ఎన్నోటౌర్నమెంటులు గెలుచుకొన్నాడు. ఈ మధ్యే జనవరి 7 న నాగపూర్ లో జరిగిన ఆల్ ఇండియా టోర్నమెంట్ లో నెంబర్ 1సీడెడ్ ఉండి రజత పథకము పొందాడు.రాజ రుథ్విక్ యొక్క చదరంగపు ప్రయణాము ఎంతొ అంకుటిత దీక్షతొ కూడినది, గెలుచుకున్న విజయాలు ఎంతొ కష్టపడి సాదించినవి. ఒక పన్నెండు సంవత్సరముల బాలుడు ప్రతి రొజు నాలుగు నుంచి ఆరు గంటలు చెస్ ఆడుట, ఆ పిల్లని పట్టుదలకు మరియు శ్రమకు నిదర్శనము.
రుథ్విక్ విజయాలకు ముఖ్య కారణములు అతని పట్టుదల, పడ్డ శ్రమ మరియు అతని క్రమ శిక్షణ. కాని అతని విజయములు మరియు అభివృద్ది వెనుక మరో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు వారే అతని తల్లి తండ్రులు దీపిక మరియు శ్రీనివాస్ రాజవరం.తల్లి దీపిక రుథ్వికుని తీసుకొని- శ్రీలంక, ఊజ్బెకిస్తాన్, దుబాయ్, సింగపూరు లాంటి దేశములు ప్రయాణము చేసినది. భారత దేశములో కూడ- డిల్లీ, ముంబయి, అహ్మదాబాద్ , చెన్నై లాంటి పెద్ద నగరములకు- ధార్వాడ్, భీమవరము మరియు కొల్లహపూర్ లాంటి చిన్న నగరములకు రెండు,మూడు వారముల తరబడి ప్రయాణము చేస్తూ ఉంటారు.

తండ్రి శ్రీనివాస్ తెలంగాణ విద్యుత్ బోర్డులొ డివిజినల్ ఇంజనీర్, ఆఫిసులొ రొజు రాత్రి తొమ్మిది గంటలకు వరకు పని చేస్తాడు . శ్రీనివాస్ కూడ మంచి చెస్సు ఆటగాడు. శ్రీనివాస్ చదువుకునే రోజుల్లొ వేంకటేశ్వర యునివర్సిటి చెస్ చాంపియన్ మరియు ప్రస్తుతము దేశములొ ఉన్న అన్ని విద్యుతు బోర్డులకు చాంపియన్. రుథ్విక్కు మొదటి గురువు, తండ్రి శ్రీనివాసే. రుథ్విక్ వివిధ నగరములొ చెస్ ఆడుతుంటె, శ్రీనివాస్ తాను పనిలొ ఎంతొ బిజీగా ఉన్న తీరిక చెసుకొని ఫొను ద్వార మరియు ఆన్-లైనులొ సలహలు ఇస్తూ ఉంటాడు. మొదట మూడు సంవత్సరములు రుథ్వికుకు వరంగలులొ ఒక కోచ్ ను పెట్టి నెర్పించారు. అయిదు సంవత్సరముల నుండి హైద్రాబాదులొ పెద్ద పెద్ద ఆటగాల్ల వద్ద కోచింగ్ తీసుకొంటున్నాడు.

మన మంథనికి కీర్తి ప్రతిష్టలు తెస్తున్న రుథ్విక్ మరిన్ని విజయాలు సాధించాలని మంథని ప్రజలు హృదయపూర్వకముగా కోరుకుంటున్నారు

                                                                                                                                                సేకరణ  రాజవరం సునీల్ 

You are able to post comments by logging in through facebook.

comments

Share.

Comments are closed.