గుండె పదిలానికి బాదం పప్పు

0

బాదాం పప్పు గర్భిణులకు ఎక్కువ మేలు చేస్తోంది.  బాదాంను పాలలో కలిపి సేవిస్తే ఆరోగ్యానికి మంచిది. బాదాం పేస్ట్‌ను మిల్క్ క్రీవ్‌ుతో కలిపి రోజూ చర్మానికి రాసుకుంటే చర్మం కాంతివంతంగా  కనిపిస్తుంది. బాదాం ఆయిల్ తలనొప్పి నివారణిగా ఉపయోగపడుతుంది. బాదాంపప్పు మగవారిలో లైంగికశక్తిని పెంచుతుంది.

* బాదాం పప్పులో ప్రొటీన్‌లు, పీచుపదార్థాలు ఎక్కువగా ఉన్నాయి. పీచుపదార్థం మలబద్ధకాన్ని నిరోధిస్తుంది. బరువు తగ్గేవారికి మేలు చేస్తాయి. బాదాం పప్పులో కెలొరీల శాతం తక్కువ కాబట్టి ప్రతిరోజు తీసుకున్నా సమస్య ఉండదు.
* రోజు బాదాం పప్పు తీసుకుంటే గుండె ఆరోగ్యం పదిలంగా ఉంటుంది.
* దీనిలో ఉండే ఫైటో కెమికల్స్ క్యాన్సర్‌ని నిరోధిస్తాయి.
* ఇందులో లభించే విటమిన్ ‘ ఇ’ యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేయడం వల్ల ముసలితనం తొందరగా రాదు. అంతేకాదు 10 బాదాం పప్పుల చొప్పున వారంలో ఐదు సార్లు తీసుకుంటే హృద్రోగ సమస్యలు నియంత్రణలో ఉంటాయి.
* పిండిపదార్థం తక్కువగా ఉంటుంది. మధుమే హ రోగులకు మంచిది. బాదాం పప్పును భోజనం

తరువాత తీసుకుంటే మంచి ఫలితముంటుంది. ఇది రక్తంలో ఇన్సులిన్ శాతాన్ని పెంచుతుంది.
* నీళ్లలో రెండుమూడు బాదాం పప్పులు నానబెట్టి మర్నాడు చిన్నారులకు తినిపిస్తే జ్ఞాపకశక్తి పెరుగుతుంది.
* దీనిలో ఐరన్, కాపర్, పాస్ఫరస్,పొటాసియం, మెగ్నీషియం, విటమిన్ బి1, బి2,బి3 ఉంటాయి.
* బాదాం పప్పును మిల్క్‌షేక్‌లో కలిపి తీసుకుంటే మంచి ఫలితముంటుంది.
* శరీరంలో ఏర్పడే వ్యర్థపదార్థాలను బయటకు పంపే గుణం ఉంది.
* బాదాంలో పొటాషియం ఎక్కువ, సోడియం తక్కువగా ఉంటుంది. ఫలితంగా రక్తపోటు సమస్య ఉండదు. రక్తప్రసరణ సక్రమంగా జరుగుతుంది.

You are able to post comments by logging in through facebook.

comments

Share.

Comments are closed.