Gouri Gundam Water Falls

0

కమాన్‌పూర్, పెద్దపల్లి రెండు మండలాల పరిధిలోని గుండారం – సబ్బితం సరిహద్దుల్లోని గుట్టపై ఉన్న గౌరీగుండం గత వారం రోజులుగా పర్యాటకులతో కిటకిటలాడుతుంది. సబ్బితం నుంచి రెండు కిలో మీటర్ల దూరంలో ఉన్న ఈ గౌరీగుండం వద్దకు పర్యాటకులు వెళ్లేందుకు వీలుగా సబ్బితం యువకులు మట్టి రోడ్డును సైతం తాత్కళికంగా ఏర్పాటు చేయడంతో గుట్ట వద్దకు సులువుగా చేరే మార్గం సుగుమం అయ్యింది. ఈ గౌరీగుండం, కుంటాల జలపాతాన్ని మరిపిస్తోన్నదని పర్యాటకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

శ్రావణ మాసం కావడంతో పర్యాటకులు పోట్టెతుత్తున్నారు. కమాన్‌పూర్, పెద్దపల్లి, మంథని, ముత్తారం మండలాల నుంచే కాక పారిశ్రామిక ప్రాంతమైన గోదావరిఖని, రామగుండం, ఎన్‌టిపిసి, 8వ కాలనీ తదితర ప్రాంతాల నుంచి నిత్యం వందలాది సంఖ్యలో పర్యాటకులు, యువతి, యువకులు గుట్టపైకి ఎక్కి గుట్ట అందాలను, ప్రకృతి రమణీయాతను ఆస్వాదీంచడంతో పాటు పై నుంచి వర్షాపు నీరు క్రిందకు జారే గౌరీగుండం జలపాతం వద్ద ఉత్సహంగా స్నానాలు చేస్తున్నారు. అనంతరం గుట్టపైన ఉన్న శివ లింగాన్ని దర్శించుకోని ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఈ శ్రావణ మాసం ముగిసే వరకు గౌరీగుండం నిత్యం వందలాది మంది పర్యాటకులతో కళకళలాడనున్నది.

You are able to post comments by logging in through facebook.

comments

Share.

Comments are closed.