కీళ్ల నొప్పులకు అల్లం మేలు…

0

అల్లం ఆరోగ్యానికి చాలా మంచిది. అల్లాన్ని తలుచుకోగానే ముఖంలో కూడా ఘాటైన ఫీలింగ్ కలుగుతుంది. కానీ అల్లం చేసే మేలు అంతా ఇంతా కాదు. జీర్ణశక్తిని పెంచడంతో పాటుగా వాంతులు, వికారాన్ని నివారిస్తుంది. పేగుల్లో ఏర్పడే గ్యాస్‌ను నిరోధించే మంచి మందిది. కండరాల నొప్పి, పార్శ్వనొప్పి, తలనొప్పి, కీళ్లనొప్పుల నివారణకు అల్లం ఎంతగానో ఉపయోగపడుతుంది. అల్లాన్ని కూరల్లోనే కాకుండా బార్లీలో కలిపి కూడా తీసుకోవచ్చు. అల్లం ముక్కలు, నిమ్మరసం, తేనె కలిపి తీసుకోవడం హితకరం. కడుపులో మంట రాకుండా నివారించేందుకు అల్లం వాడతారు. మజ్జిగలో కరివేపాకుతో పాటుగా అల్లం సన్నగా ముక్కలు తరిగి తీసుకుంటే తాపం తగ్గడానికి ఉపయోగపడడమే కాకుండా ఎంతో మేలు చేస్తుంది.

You are able to post comments by logging in through facebook.

comments

Share.

Comments are closed.