గ్యాస్ట్రిక్ సమస్యకు ఇంటి వైద్యం

0

ఈ రోజుల్లో గ్యాస్‌తో బాధపడేవారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. వీటికి మన అలవాట్లే ప్రధాన కారణం. తినే ఆహారాన్ని నమలకుండా గబగబా మింగడం, మాట్లాడుతూ తినడం, నోరు ఎక్కువగా తెరిచి నమలడం, బీర్, కోలా వంటి కార్బొనేటెడ్ పానీయాలు కూడా గ్యాస్‌కు కారణాలు. అంతేగాక స్మోక్ చేయడం వల్ల ప్రేగుల్లోని కొన్ని బ్యాక్టీరియాలు గ్యాస్‌ను ఎక్కువగా ఉత్పత్తి చేస్తాయి. గ్రాస్ట్రిక్ సమస్య ఉన్నవారు సరిగ్గా తినకపోవడం , తొందరగా తిన్నది జీర్ణం కాకపోవడం, కడుపులో మంట, పులుపు, కారంలాంటివి ఎక్కువగా తినలేకపోవడం లాంటివి ఎన్నో బాధలు పడుతూ ఉంటారు. గ్యాస్ వల్ల పొట్టలో ఉబ్బరం కలుగుతుంది. త్రేన్పులు వస్తాయి. కడుపులో నొప్పి, అజీర్ణం కలుగుతుంది. ఈ సమస్యకు సంబంధించి మందులు వేసుకున్నా అది తాత్కాలికమే. గ్యాస్ రాకుండా ఉండాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలుసుకుందాం..

ఆహారాన్ని బాగా నమిలి నెమ్మదిగా తక్కువగా తినాలి
ధూమపానం, జర్దా, పాన్ వంటివి తినకూడదు.
కొన్ని వ్యాయామ పద్ధతులు పాటించాలి.
కూల్‌డ్రింక్స్, తీపిపదార్థాలు తగ్గించాలి.
వేళకి భోజనం చేయాలి.
రోజుకు 10-12 గ్లాసుల నీళ్లు తాగాలి
ధనియాలు నమలడం వల్ల గ్యాస్ సమస్య నుంచి బయట పడొచ్చు
కప్పు మరిగే నీటిలో కొద్దిగా అల్లం, తేనె కలిపి తాగితే ఉపశమనం కలుగుతుంది.
అదేవిధంగా తాజా అల్లం ముక్కని నిమ్మరసంలో ముంచి అన్నం తిన్నాక, తింటే ఆహారం త్వరగా జీర్ణం అవుతుంది.
గ్యాస్ రిలీఫ్‌కి ఇంగువ బాగా పనిచేస్తుంది.
తులసి ఆకులు నమిలితే కడుపులో గ్యాస్ ఏర్పడదు.

You are able to post comments by logging in through facebook.

comments

Share.

Comments are closed.