జి.వి.ఆర్ శ్రమను గుర్తించిన కే.సి.ఆర్

0

జి.వి.ఆర్ (గంట వెంకట రమణా రెడ్డి) సాధారణ రైతు కుటుంభం.ఎన్టీఆర్ పై ఉన్న అభిమానంతో 1990 లో టీడీపీలో చేరారు.1995 లో రత్నపూర్ ప్రాథమిక వ్యవసాయ సంఘానికి డైరెక్టర్ గా ఎన్నికైనారు.2005 సంవత్సరంలో మళ్లీ ప్రజల మనసు గెలిచి చైర్మన్ గా వ్యవహరించారు.మూడు నెలలకే జడ్పీటీసీ ఎన్నికలు రావటంతో చైర్మన్ పదవికి రాజీనామా చేసి స్థానిక ప్రజల అండతో భారీ విజయాన్ని నమోదు చేశారు.తెలంగాణ మలిదశ ఉద్యమంలో జి.వి.ఆర్ ది కీలకపాత్ర.కే.సి.ఆర్ ఆమరణ దీక్షకు మద్దతుగా కమాన్ పూర్ మండలం లో నిరాహార దీక్షలు చేప్పట్టి తెలంగాణా ఉద్యమాన్ని గ్రామాల్లోకి తీసుక వెళ్లారు, 2010 లో జడ్పీటీసీ పదవికి రాజీనామా చేసి  టీ.ఆర్.స్ లో చేరి ప్రతి గ్రామంలో తిరుగుతూ తెలంగాణా ప్రాముఖ్యతను వివరిస్తూ వచ్చారు.కే.సి.ఆర్ ఏ ఆదేశం ఇచ్చిన తూచా తప్పకుండ పాటించేవారు.మిలియన్ మార్చ్ సందర్భంలో కమాన్ పూర్ నుండి దాదాపు 6000 మంది యువకులతో బయలు దేరి తెలంగాణ గ్రామాల గుండె చప్పుడును తెలంగాణ ఆకాంక్షను తెలియజేశారు.ఉద్యమ సమయంలో ఎన్నో కేసులు భరించారు. ప్రజలు జి.వి.ఆర్ కృషిని మరువలేదు తిరిగి 2014 స్థానిక ఎన్నికల్లో ఎంపీటీసీ గెలిపించారు.ఉద్యమ సమయంలో పార్టీకి అండగా నిలిచినా జి.వి.ఆర్ శ్రమను కెసిఆర్ గుర్తించి పెద్దపల్లి జిల్లా అధ్యక్షునిగా చేశారు.ఈ పదవి కోసం ఎంతో మంది తమ సిఫారసులు చేసుకున్నారు కానీ కెసిఆర్ మదిలో కష్టం చేసిన వాడికే పదవి ఇవ్వాలని గంట వెంకట రమణ రెడ్డికి ఇచ్చారు.

You are able to post comments by logging in through facebook.

comments

Share.

Comments are closed.