సేవకు అంకితం అయిన ఆ ఇద్దరు సోదరులు

0

మంథని పట్టణానికి చెందిన గంగా మహాదేవ్   1987 లో సత్యసాయి సేవ సమితి స్థాపించి  ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు సామాజిక సేవకు శ్రీకారం చుట్టారు.మంథని గ్రామంలోని పేదలకు ఉచిత వైద్య శిభిరాలు ప్రారంభించారు.మంథని ప్రాంతంలోని బస్టాండ్ సమీపంలో సత్యసాయి ఆలయాన్ని నిర్మించి ఆలయ కేంద్రంగా విద్యార్థులకు మరియు వృద్దులకు తమకు తోచినంత సహాయం చేస్తువచ్చారు. ఆ తర్వాత రహదారి ప్రమాదంలో గంగా మహాదేవ్ మృతి చెందగా అతని ఆశయాలను సోదరుడు గంగా రాధాకిషన్ సొంత డబ్బులతో  సేవలను కొనసాగిస్తున్నారు.గంగా రాధాకిషన్ గారు ఒకటే నమ్ముతారు.”ఈ జీవితం చాల చిన్నది.మనం బ్రతికి ఉన్నంత కాలంలో మన చుట్టూ ప్రక్కల ఉన్న పేద ప్రజలను ఆదుకోవాలి.”మానవ సేవనే మాధవ సేవ అని దాన్ని ఆచరణలో పెడుతు ముందుకు సాగుతున్నారు.ప్రతి నెల మొదటి మంగళ వారం మధుమేహం,కీళ్ల నొప్పులు మరియు ఇతర ఆరోగ్య సమస్యలకు ఉచితముగా మందులు అందిస్తున్నారు.అలాగే మంథని ప్రాంతములోని వైద్యులు సురేష్,రాధాకృష్ణ,నారాయణ ఉచితంగా సేవలందిస్తున్నారు.అదే కాకుండా మహిళలు స్వయం ఉపాధి కోసం ఉచిత కుట్టు మిషన్లు కూడా పంపిణి చేస్తున్నారు.వీరు చేస్తున్న సేవలకు మనమంథని.కామ్ హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాము.వీరిని ఆదర్శముగా తీసుకోని మరింత మంది ముందుకు వచ్చి మంథని ప్రాంతములో ఆరోగ్య మరియు ఉపాధి అవకాశాలు మేగుపర్చాలని మన మంథని వెబ్సైటు కోరుతుంది.

You are able to post comments by logging in through facebook.

comments

Share.

About Author

Comments are closed.