ప్రభుత్వ పాఠశాలల కోసం రూ. 5 కోట్లు మంజూరు

0

ప్రభుత్వ పాఠశాల మౌళిక సదుపాయల కోసం రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ సహకారంతో మంథని నియోజకవర్గానికి మొదటి విడతగా రూ. 5 కోట్లు మంజూరు కావడం జరిగిందని మంథని ఎంఎల్‌ఎ పుట్ట మధు అన్నారు.సోమవారం కమాన్‌పూర్ మండలంలోని రొంపికుంట గ్రామంలో రూ. 41 లక్షలతో నిర్మించిన జిల్లా పరిషత్ పాఠశాల భవనంతో పాటు రూ. 13 లక్షలతో నిర్మించిన పిఎస్ పాఠశాల భవనంతో పాటు రూ. 1.25 లక్షలతో నిర్మించిన టాయిలెట్ సౌకర్యాలను ఆయన ముఖ్య అతిధిగా హజరై రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. మంథని నియోజకర్గంలోని ప్రభుత్వ పాఠశాలల్లో కంపౌడ్ వాల్స్, మంచినీటి సౌకర్యం, తదితర మౌళిక సదుపాయల కల్పన కోసం అధికారులతో అంచనాలు వేయగా, రూ. 12 కోట్లు అవరమవుతాయని తెలిందన్నారు. పేద విద్యార్ధులు ఎక్కువగా చదువుకోనే ప్రభుత్వ పాఠశాల మౌళిక సదుపాలయ కోసం తమ ఎంఎల్‌ఎ నిధుల నుంచి రూ. కోటి, పేదలు ఎక్కువగా ప్రయాణించే ఆర్టిసీ బస్సుస్టాండ్‌ల మరమ్మత్తుల కోసం రూ. 57 లక్షలు కేటాయించడం జరిగిందని గుర్తు చేశారు.

ఈ కార్యక్రమంలో ఎంపిపి ఇనుగంటి ప్రేమలత, జడ్పిటిసి మేకల సంపత్‌యాదవ్, మార్కెట్ కమీటి ఛైర్మన్ ఫీట్ల మంజులగోపాల్, సర్పంచ్ పులిపాక శారదరాయలింగు, ఎంపిటిసి పులిపాక పుష్పశ్రీనివాస్, ఉపసర్పంచ్ ఉప్పరి మొండయ్య, ఎంఇఓ సంపత్‌రావు, హెచ్‌ఎంలు పద్మనాభం, శ్రీనివాస్, డిఇ విన్సల్‌రావు, ఎఇలు నరేష్, ఆశోక్, టిఆర్‌ఎస్ నాయకులు దాసరి రాజలింగు, ఇనుగంటి రామారావు, కోట్టె భూమయ్య, రుద్రభట్ల రఘుప్రసాద్ శర్మ, చింధం సతీష్, గుండేటి రాంమూర్తి తదితరులు పాల్గొన్నారు.

 

You are able to post comments by logging in through facebook.

comments

Share.

Comments are closed.