రోడ్డు ప్రమాదంలో తండ్రీకూతుళ్లు దుర్మరణం

0

కరీంనగర్: జిల్లాలోని బెజ్జంకి మండలం తోటపల్లి వద్ద శనివారం ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో తండ్రీకూతుళ్లు అక్కడికక్కడే మృత్యువాతపడ్డారు. కాగా మరో ఇద్దరు తీవ్ర గాయాలపాలయ్యారు. రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని వేగంగా వెళ్తున్న కారు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది. వివరాల్లోకి వెళితే… మంథనికి చెందిన హోండా షోరూం యజమాని సదాశివ రెడ్డి(55), కూతురు నిహారిక(14)తో కలిసి హైదరాబాద్ వెళ్లి తిరిగి వస్తుండగా తోటపల్లి సమీపంలోకి రాగానే రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తండ్రీకూతుళ్లు ప్రమాద స్థలంలోనే మృతిచెందారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం  ఆస్పత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

You are able to post comments by logging in through facebook.

comments

Share.

Comments are closed.