హెచ్‌ఐవీకి మందు కనిపెట్టిన మంథని డాక్టర్

0

ప్రాణాంతక వ్యాధి హెచ్‌ఐవీ వైరస్‌కు హోమియోపతి మందులు పరిష్కారం చూపుతాయన్న దిశగా వినూత్న పరిశోధనలు చేపట్టి రామంతాపూర్ జేఎస్పీఎస్ కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ ప్రవీణ్‌కుమార్ విజయం సాధించారు. ప్రవీణ్‌కుమార్ కరీంనగర్ జిల్లా మంథని గ్రామానికి చెందినవారు. క్రొటాలస్ హరిడస్ హోమియోపతి మందుతో బాధితుడి శరీరం నుంచి వైరస్‌ను పూర్తిగా తగ్గించవచ్చని ఆయన నిరూపించారు. వైద్య పరిశోధనలో భాగంగా ఇప్పటివరకు ఆయన 98మంది రోగులకు మందులను ఇచ్చి పరీక్షించారు. ఆరునెలల పాటు మందులను వాడిన ఆరుగురు రోగులకు హెచ్‌ఐవీ వైరస్ లోడ్ పూర్తిగా జీరోకు చేరుకున్నట్లు వైద్యపరీక్షల్లో తేలింది. ఎయిడ్స్ చివరి దశకు చేరిన ఇద్దరు రోగులు సైతం సాధారణ స్థితికి వచ్చినట్లు ప్రవీణ్‌కుమార్ తెలిపారు. క్రొటాలస్ హరిడస్ డ్రగ్ సుమారు 200 ఏండ్ల నుంచి అందుబాటులో ఉందన్నారు. ఎబోలా వ్యాధికి మందు కనిపెట్టడానికి చేసిన ప్రయోగం హెచ్‌ఐవీ వైరస్‌ను నిరోధించడంలో సక్సెస్ అయినట్లు తెలిపారు.

-రామంతాపూర్ జేఎస్పీఎస్ కళాశాల ప్రొఫెసర్ అరుదైన ఘనత
-క్రొటాలస్ హరిడస్ ఔషధంపై డాక్టర్ ప్రవీణ్‌కుమార్ పరిశోధన
-కరీంనగర్ జిల్లా మంథనికి చెందిన ప్రవీణ్‌కుమార్
-రామంతాపూర్‌లో ప్రతీ గురువారం ఉచితంగా మందుల పంపిణీ

ఐఐసీటీ శాస్త్రవేత్తలు డాక్టర్ ఎస్ చంద్రశేఖర్, డాక్టర్ ప్రథమల సహకారంతో 2013 నుంచి పరిశోధన చేస్తున్నట్లు ప్రవీణ్‌కుమార్ పేర్కొన్నారు. బ్రెజిల్‌లో విషసర్పంతో తయారు చేసిన డ్రగ్‌తోపాటు పుణె నేషనల్ వైరాలజీ ఇన్‌స్టిట్యూట్‌లో క్రొటాలస్ హరిడస్‌పై పరిశోధన చేసి ఫలితాన్ని సాధించినట్లు తెలిపారు. హెచ్‌ఐవీ వైరస్‌ను అల్లోపతి మందులతో సుమారు 60 శాతం మాత్రమే తగ్గుతుందని, హోమియోపతితో 100 శాతం ఫలితాలను సాధించవచ్చని ఆయన వివరించారు. ఈ మందును హైద్రాబాద్ లోని  రామంతాపూర్ ప్రభుత్వ హోమియో హాస్పిటల్‌లో ప్రతి గురువారం హెచ్‌ఐవీ రోగులకు ఉచితంగా పంపిణీ చేస్తున్నట్లు ప్రవీణ్‌కుమార్ తెలిపారు.

Clinic Address: In the lane, opp:Syndicate Bank, Street No.1,Ashok Nagar,Hyderabad

phone: 040-27664146

You are able to post comments by logging in through facebook.

comments

Share.

Comments are closed.