కమాన్‌పూర్ లో‌ కలెక్టర్‌ ఆకస్మిక పర్యటన

0

కమాన్‌పూర్‌ మండల కేంద్రంలో జిల్లా కలెక్టర్‌ అలగు వర్షిణి ఆకస్మిక పర్యటనలో భాగంగా మండల కేంద్రంలోని తహశీల్దార్‌, ఎంపీడీఓ కార్యాలయాలతో పాటు అంసపూర్తి భవనాలను పరిశీలించారు. అనంతరం కమాన్‌పూర్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ మండల కేంద్రంలో అసంపూర్తిగా ఉన్న ఎస్సీ హస్టల్‌, జూనియర్‌ కళాశాల భవనాలను వెంటనే పూర్తి చేసి విద్యార్ధులతో అందుబాటులోకి తెస్తామని ఆమె పేర్కొన్నారు. కళ్యాణ లక్ష్మి, షాదీముబారక్‌ దరఖాస్తు దారులకు గెజిటెడ్‌ సంతకం అవసరం లేదని వీఆర్వో, కార్యదర్శి, జెడ్పీహెచ్‌ఎస్‌ ప్రధానోపాధ్యాయుడు ధృవీకరిస్తే సరిపోతుందని ఆమె తెలిపారు. జిల్లాలో పెండింగ్‌లో ఉన్న అభయహస్తం ఫించన్లు త్వరలోనే మంజూరు అవుతాయని జిల్లాలో1కోటి 44లక్షల 32వేల ఉపాధికూలీల వేతనాలు విడుదల అయినట్లు ఆమె తెలిపారు. రేషన్‌ పక్కదారి పట్టకుండా ఆధార్‌ లింకు చేయడం వల్ల లబ్దిదారులకు అన్ని విధాలుగా సౌకర్యంగా ఉందన్నారు. వారధి సంస్థ ద్వారా చదువుకుని నిరుద్యోగులుగా ఉన్న యువతీయువకులకు శిక్షణ తరగతులు ఇచ్చిఉద్యోగాలు పొందేలా శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పారు.

ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ లబ్దిదారులకు రుణాలు ఆయా బ్యాంకుల ద్వారా మంజూరైన వారికి త్వరలో సబ్సీడీ గ్రౌండింగ్‌ చేయడం జరుగుతుందని తెలిపారు. మండల కేంద్రంలో శిథిలావస్తలో ఉన్న తహశీల్దార్‌ భవనాన్ని ఆమె పరిశీలించి త్వరగా మరమ్మతులు చేపట్టనున్నట్లు, వెంటనే భవనానికి సంబంధించిన వివరాలను సర్వేయర్‌తో సర్వే చేసి పంపించాలని సంబంధిత అధికారులకు సూచించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో సిబ్బంది సమయపాలన పాటిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండి సక్రమంగా విధులు నిర్వహించాలని హెచ్చరించారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించడానికి వసతి కల్పించాలని కాంగ్రెస్‌ నాయకుడు గాండ్ల మోహన్‌ వినతిపత్రం అందజేశారు. అదేవిధంగా పెంచికల్‌పేట గ్రామంలో రైతులు ధాన్యం విక్రయించుకోవడానికి ఐకేపీ కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని వినతిపత్రం అందజేశారు. ఈ పర్యటనలో ఎంపీడీఓ రాజు, ఆర్‌ఐ వినయ్‌, ఎంఈఓ సంపత్‌రావు, ఏఓ ప్రమోద్‌, వెటర్నరీ అధికారి సురేందర్‌రెడ్డి, శాంతికుమార్‌,పురుషోత్తం, తదితరులు పాల్గొన్నారు.

You are able to post comments by logging in through facebook.

comments

Share.

Comments are closed.