చుక్కల అమావాస్య

0

ఆషాఢ బహుళ అమావాస్యను ‘చుక్కల అమావాస్య’గా కూడా పిలుస్తుంటారు. లక్ష్మిప్రదమైన శ్రావణమాస ప్రారంభానికిముందు వచ్చే అమావాస్య కనుక ఈ రోజు అధికసంఖ్యలో దీపాలను పెట్టి లక్ష్మీదేవిని పూజించడం మంగళప్రదమని ధర్మశాస్త్ర వచనం. అంతేకాక దక్షిణాయనంలో మొదటిది కనుక ఈ దీపప్రజ్జ్వలనతో పితృ దేవతలు కూడా సంతోషిస్తారు.వివాహితులైన స్త్రీలు సౌభాగ్యాన్ని కోరుతూ ఈ రోజున వ్రతాన్ని చేస్తుంటారు. దీప స్తంభానికి సున్నపు చుక్కలు పెట్టడం … నైవేద్యంగా పచ్చి పిండితో చుక్కలు పెట్టడం, వెండి చుక్కను గానీ .బంగారు చుక్కను గాని దానంగా ఇవ్వడం ఈ వ్రత విధానంలో ప్రత్యేకంగా కనిపిస్తూ వుంటుంది.ఈ కారణంగానే దీనిని చుక్కల అమావాస్య అని అంటారు.

ఈ రోజున కొన్ని ప్రాంతాలలో ‘దీపపూజ’ను నిర్వహిస్తుంటారు. ఉదయాన్నే స్నానం చేసి ఇంట్లో ఒక వేదిక వంటిది ఏర్పాటు చేసుకుని, దానిపై ముగ్గులు పెడతారు. ఆ ముగ్గుల మధ్యలో ప్రమిదలు వుంచి వెలిగించి, తీపి పదార్థాలను నైవేద్యంగా సమర్పిస్తుంటారు. ఈ రోజున సాయంత్రం కూడా ఇదే విధంగా దీపాలను పూజించి, బ్రాహ్మణులకు దక్షిణ తాంబూలాలు ఇవ్వడం చేస్తుంటారు. ఈ విధంగా చేయడం వలన శుభం జరుగుతుందని విశ్వసిస్తుంటారు.

ఈ రోజున స్త్రీలు అందరు గౌరీ అమ్మవారికి పూజ చేసి బియ్యం పిండి, పాలు కలిపి ఆ ముద్దతో చిన్న చిన్న ఉండలుగా చేసి అమ్మవారికి నివేదన చేస్తారు. ఈ ముద్దలను చుక్కలుగా పిలుస్తారు. కొన్ని ప్రాంతాలలో కొత్త కోడళ్ళు ఉదయం నుండి సాయంత్రం వరకు ఉపవాసం చేసి, సాయంత్రం అమ్మవారికి పూజ చేసి, 100 చుక్కలను, దారమును వంద వరుసలు పోసి దండగా చేసి మరుసటి రోజు వరకు దానిని ధరించడం, అమావాస్య రోజు సాయంత్రం కేవలం పాయసం, కొంత అల్పాహారం మాత్రమే తినడం జరుగుతుంది.
మరుసటి రోజు నుండి శ్రవణ మాసం ప్రారంభం అవుతుంది

You are able to post comments by logging in through facebook.

comments

Share.

About Author

Comments are closed.