శ్రీ దుర్గాభవానీ శత చండీ యాగం

0

కరీంనగర్ జిల్లా నగునూర్ మండలంలో 19 నుండి మూడు రోజుల పాటు శ్రీ దుర్గాభవానీ శత చండీ యాగం చేయనున్నారు. నగునూర్‌లో నిర్మిస్తున్న శ్రీ దుర్గా భవానీ ఆలయంలో శత చండీ మహాయాగం నిర్వహిస్తున్నామని వేద పండితుడు పురాణం మహేశ్వర్మ తెలిపారు.

స్థానిక గీతాభవన్‌లోని కాన్ఫరెన్స్ హాల్‌లో సోమవారం ఉదయం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆలయ చైర్మన్ వి.లక్ష్మణ్, డాక్టర్ ఎడవల్లి విజయేంద్రారెడ్డి, వి.ద్రోణాచారితో కలిసి మాట్లాడారు. యాగానికి రాష్ట్రంతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి సుమారు 30 మంది వేద పండితులు హాజరవుతారని తెలిపారు.

You are able to post comments by logging in through facebook.

comments

Share.

Comments are closed.