Avadhanula Vasantha Sharma

0

మంథని ప్రభుత్వ హాస్పిటల్ లో రోగులకు ప్రతి రోజు పాలు మరియు బిస్కెట్ ల ను రిటైర్డ్ ఉపాధ్యాయులు అవధానుల వసంత శర్మ గారు అందిస్తునారు .రోజు ఉదయము 8 గంటలకు పాలను తన ఇంటి వద్ద వేడి చేసి ,ప్రభుత్వ హాస్పిటల్ లో ఉండే నిరుపేదలు అయిన రోగులకు తన వంతుగా సమాజ సేవ చేస్తున్నారు.వసంత శర్మ గారి గొంతు వినగానే రోగులు తమ పాల గ్లాస్ తో లైన్ లో నిలబడి పాలు తీసుకుంటారు .ప్రతి ఒక్క రోగి ఇయన చేసే సేవకు వారి కుటుంబం పది కాలాల పాటు చల్లగా ఉండాలని కోరుకుంటున్నారు . మానవ సేవె మాధవ సేవ అని తెలుసుకొని , వసంత శర్మ గారు లాగా మన మంథని లో ఉండే వారు ప్రతి ఒక్కరు ఏదో రకముగా మన వాళ్ళకు సహాయము చేయాలనీ మన మంథని వెబ్ సైట్ నిర్వాహకులు చక్రగారి అరుణ్ కుమార్ కోరుతున్నారు.

You are able to post comments by logging in through facebook.

comments

Share.

Comments are closed.