Adai – ఇది తమిళ వంటకం

0

Ingredients

పెసర్లు లేదా పెసరపప్పు 1 కప్పు

శనగలు లేదా శనగ పప్పు 1 కప్పు

కందులు లేదా కంది పప్పు 1 కప్పు

మినుములు లేదా మిప పప్పు 2 టీస్పూన్లు

బియ్యం 2 కప్పులు

 

Steps

Step -01 : పైన తెలిపిన పదార్థాలను అన్నింటినీ ఒక గిన్నెలో తీసుకుని కడిగి నానబెట్టుకోవాలి
Step -02 : 2 గంటలు నాననివ్వాలి.
Step -03 : తర్వాత మిక్సీలో కొంచెం కరివేపాకు, ఆరు పచ్చిమిరప కాయలు ఆరు ఎండు మిరప కాయలు (కారం ఎక్కువ కావాలంటే మరిన్ని చేర్చండి) వేసి నానబెట్టిన పప్పులను కూడా వేసి కొంచెం రవ్వ రవ్వగా ఉండేట్టు కొద్దిగా నీటిని చేరుస్తూ రుబ్బుకోవాలి
Step -04 : దోసె పిండి లాగా వదులుగా ఉండకూడదు మరియు చపాతి పిండి లాగా గట్టిగానూ ఉండకూడదు.
Step -05 : రుచికి తగినంత ఉప్పు మరియు కొత్తిమీర వేసి దీనిని 2 గంటల పాటు పులియనివ్వండి.

Step -06:తర్వాత స్టవ్ వెలిగించి పెనం పెట్టుకోవాలి. పెనం వేడి అయిన తర్వాత కొద్దిగా నూనె రాసి దానిపై ఈ రుబ్బుకున్న పిండిని దోసె లాగా పోసుకోవాలి.

Step -07:అల్లం వెల్లుల్లి తినే వారు రుబ్బేటపుడు దానిలో చేర్చుకోవచ్చు. 

 

ఇది తమిళ వంటకం. అయినా గానీ ఆకలికి తమిళం ఏంటీ, బెంగాలీ ఏంటీ. ఏదయినా ఒకటే. మంచి రుచికరమైన, పోషకాలతో కూడిన వంటకం అయితే చాలు. ఇందులో అన్ని పప్పులు కలిసి ఉంటాయి. మంచి పోషక విలువలు ఉంటాయి. ఇందులో కారం ఉప్పూ కలిసే ఉంటాయి కాబట్టి నంచుకోవడానికి ఏమీ లేకుండా కూడా దీనిని తినవచ్చు. కావాలంటే చట్నీ లేదా సాంబారుతో తినవచ్చు- రేవతి శర్మ 

You are able to post comments by logging in through facebook.

comments

Share.

About Author

Comments are closed.