ఆదివరాహస్వామి

0

దశావతారల్లో ఆదివరాహస్వామి అవతారం ప్రసిద్ధి.విశ్వమాత జలయమై ఉన్న సమయంలో మహాసురుడు హిరణ్యకుడు భూదేవిని చాపగా చుట్టి సముద్ర గర్భంలో దాకున్నపుడు ఆమెను ఉద్దరించటం కోసం మహావిష్ణువు ఆదివరహా రూపాన్ని ధరించి హిరణ్యకుడిని వధించి భూదేవిని రక్షిస్తాడు.ఆది నారాయణుడి అవతారాల్లో ఇది మూడవది.వరాహస్వామికి మన దేశంలో ఆలయాలు చాల తక్కువ లో తెలంగాణ లో కేవలం ఒకే ఒక్క ప్రాంతములో ఈ గుడి కనిపిస్తుంది.అది కరీంనగర్ జిల్లా లోని మంథనికి అతి సమీపంలో ఉన్న కమాన్ పూర్ మండలంలో ఉండటం విశేషం.ఆంధ్రప్రదేశ్ లో అయితే తిరుమలలో ఆదివరాహస్వామి పూజలు అందుకుంటారు.తెలుగు రాష్ట్రాలలో రెండు ప్రదేశాలలో మాత్రమే ఈదేవాలయాలు ఉండటం విశేషం.మంథని దగ్గరలోని ఈ దేవాలయ చరిత్రను తెలుసుకుందాం…దశాబ్దాల క్రితం ఒక బండరాయి చిన్న ఎలుక ఆకారం వెలువడగా,ప్రస్తుతం అది రెండు ఫీట్ల వరకు పెరిగింది.ఈ బండ రాయిపై వెంట్రుకలు కనిపించటం అరుదైన విషయం.సాక్షత్తు ఆదివరహా స్వామి నడిచి వచ్చిన పాదాలు ఆనవాళ్లు కూడా కనిపిస్తాయి.ఇంకా ఎన్నో చారిత్రక ఆధారాలు మంథని నియోజకవర్గంలో కనిపిస్తాయి.ఇక్కడికి అనేక మంది భక్తులు ఇతర రాష్ట్రాల నుండి కూడా వస్తారు..ఈ అది వరాహ స్వామి దగ్గర భక్తులు కోరుకున్న కోరికలు తీరడంతో వేల సంఖ్యల్లో ఈ ప్రదేశానికి వస్తున్నారు . ఇన్ని మహిమలు కలిగిన దేవాలయాన్ని తెలంగాణ ప్రభత్వం అభివృద్ధి చేయాలనీ ఇక్కడి ప్రజలు కోరుకుంటున్నారు.

You are able to post comments by logging in through facebook.

comments

Share.

Comments are closed.