శ్రీ శివ పురాణము-యక్షగాన కావ్యము – శ్రీ ముద్దు బాలంభట్టు గారు

0

కరీంనగర్ జిల్లాలో సాహిత్య పరంగా చాలా సుసంపన్న గ్రామమైన మంథనిలో మహాపురుషుడైన కీ||శే|| శ్రీ ముద్దు బాలంభట్టు గారు జన్మించారు.వారు రెండు యక్షగాన కావ్యాలను మన భాగ్యాన మనకందించారు. అవి శ్రీ శివపురాణము మరియు మంథని రామాయణము. ఇవి రెండూ బహు ప్రాచుర్యములు.ఇంతవరకు అంతర్జాలములో ఈ కావ్యములు ప్రచురింపబడలేదు.నా ప్రయత్నంగా మొదట శ్రీ శివ పురాణాన్ని అందించే ప్రయత్నం చేస్తున్నా.ఈ శివ పురాణములో మూడు భాగాలు కలవు అవి 1)దక్ష యాగము,2)గౌరీ జననము మరియు 3)కుమార సంభవము.జై శ్రీ రామ.

దక్ష యాగము:

శ్రీ శివ పురాణము(ప్రథమాశ్వాసము – దక్ష యాగము)

నైమిశారణ్యమున శౌనకాది మహామునులఁ గూర్చి సూతుండు చెప్పిన శివ పురాణ కథా ప్రసంగ మెఘ వలె నుండున్.

శ్లో|| శ్రీ వైరాజిత మంత్రకూట నగరే సౌందర్య వంశార్ణవే!

శ్రీ రాజేశ్వర మౌని సూనురిదమాఖ్యానంకరోత్యద్భుతం!

సంక్షేపేనసుయక్షగానతయా సత్ప్రాకృతేనోదితం!

శ్రీ శంభోజయరక్షరక్షనితరాం రక్షావిశం సర్వశః!

కీర్తన – 1:

రాగం: నాట                        తాళం: ఆది

సిద్ధి వినాయక నమోస్తుతే! శ్రీ గణరాయ జయ గణరాయ!

జయజయ దేవ హరే !!

 

పాశకుఠారవరాంకుశ పాణే!

పన్నగ భూషణ శాయినే!!    ||శ్రీ గణ ||

 

మూషకయాన నిశాకర మౌళే!

మోదకహస్త భజామహే!!     ||శ్రీ గణ||

 

భాసిత శ్రీ లంబోదర గాత్ర !

భక్త జనాప్తి దయానిధే!!      || శ్రీ గణ||

 

లోహిత లోచన ధౌత శరీర!

పాహిసురాగ్ర శిఖామణే !!    || శ్రీ గణ ||

 

విద్యాధార గురోర్గురు మూర్తే!

విఘ్నవిదూర సమారభే !!   || శ్రీ గణ ||

 

మత్త గజేంద్ర ముఖాంబుజశౌరీ!

మంత్రపురీశ్వర సూనవే!!    || శ్రీ గణ ||

 

చం||ప్రతినిగమాగమంబులను భానురమైన యశంబుగల్గు

స్తుతిమరియాదలంటెనొక సొంపుగనైమధురాన్యజన్యముల్|

ఘృతమునగొన్న భంగిశివ కీర్తన యెవ్వరికైన ఈశ్వరా

స్మృతికనుకూలమైనదని సేయుదుగాయన పూర్వకంబుగాన్||

 

You are able to post comments by logging in through facebook.

comments

Share.

Comments are closed.