Varahala Bhimayya Garu

0

మంథని కి చెందిన ప్రముఖులలొ వరహాల భీమయ్య ఒకరు.భూర్గుల రామకృష్ణ రావు ముఖ్య మంత్రిగా ఉన్నపుడు ఆయనకు భీమయ్య వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేశారు .

1948-1952 వరకు విద్యశాఖా మంత్రి దొందే రాజుకు వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేశారు.అప్పట్లో మంథనిలో తొలి పాటశాలను మంజూరు చేయించారు.ఆనాడు కరీంనగర్,మంథని లో మాత్రమే పాటశాలలు ఉన్నాయ్.విద్యశాఖా సబ్యునిగా వ్యవహరించి నూతన విధానాలను ప్రవేశ పెట్టారు .ప్రాంతీయ భాష ఉర్దూ నుండి తెలుగు కు మార్పిడి చేయించారు. ముఖ్యమంత్రి ని మంథనికి తీసుక వచ్చి శిధిల వ్యవస్థలో ఉన్న పాటశాల చూపించారు.ఈ క్రమంలో ప్రాథమిక స్తాయిగా ఉన్న పాటశాలను ఉన్నత స్తాయిగా పెంచేలా ఆనాడే నిర్ణయం తీసుకున్నారు .

మంథని లో ఉన్నత పాటశాల నెలకొల్పడం తో నియోజక వర్గం లోని వేలాది మందికి ఉన్నత చదువులకు భాటలు వేసినట్లు అయింది .మంథని ప్రాంతానికి చెందిన ఎందరో డాక్టర్లు ,ఇంజనీర్ లు ఉద్యోగాలు సాదించి దేశ విదేశాల లో ఉన్నారంటే దాని వెనక భీమయ్య కృషి ఉన్నది వాస్తవం.మంథని ప్రాంతం నుండి వివిధ పరిక్షల కోసం వెళ్ళిన విద్యార్థులు ఎందరో ఆయన ఇంట్లో నే ఉంది నెలల తరబడి చదువుకునే వారట .1956 లో మృతి చెందిన భీమయ్య జ్ఞాపకార్ధము గా J B S పాటశాలను నెలకొల్పినారు .

You are able to post comments by logging in through facebook.

comments

Share.

Comments are closed.