Sri Matha Vaibhavam

0

శ్రీ చక్ర ప్రియ సంచారిణి

శ్రీదేవి స్రిత జన పాలిని

నిను సేవించు నిరతము శ్రీ కరి

మము పాలించు శ్రీ త్రిపుర సుందరి

                                                                                 ” శ్రీ చక్ర ప్రియ “

ఆధార మందుండ యకిలాత్మలకు నీవే

ఆధారమైతివే భువనేశ్వరి

స్వాదిష్టితంబున సకల జీవులకు

సౌఖ్యము లిత్తువే శ్రీ శాంభవీ

మణిపూరకంబున మాతృమూర్తివై

మసలుదువమ్మా మాహేశ్వరీ

అనాహతంబున అఖిల గురుస్తాన

మందితివే యోగి హృదయేశ్వరీ

                                                                                 ” శ్రీ చక్ర ప్రియ “

విశుద్ధ మందున జీవమూర్తివై

వెల యుదువమ్మా విశ్వేశ్వరీ

ఆగ్నేయమందున ఆదిగురువువై

ఆనందమిత్తువే అమృతేశ్వరీ

సాహస్రమందున సౌందర్యమూర్తివై

శాసింతు వే రాజ రాజేశ్వరి

భావనా మహిమ భావించు వారికి

భద్ర్రములిత్తువే భ్రమరేశ్వరీ

                                                                                 ” శ్రీ చక్ర ప్రియ “

 

– Late Sri Kollarapu Seeta Ram Sharma Garu

You are able to post comments by logging in through facebook.

comments

Share.

Comments are closed.